Home /News /telangana /

NIZAMABAD COUPLE ARRESTED FOR GIVING FAKE GOLD AND STEALING MONEY IN NIZAMABAD DISTRICT SNR NZB

Nizamabad: భర్త మాట కలిపాడు..భార్య అది ఇస్తాను డబ్బులివ్వమని అడిగింది .. నమ్మిన వాడి పరిస్థితి ఏమైందంటే

(ఖిలాడీ జోడి)

(ఖిలాడీ జోడి)

Crime News: మార్కెట్‌లోకి కొత్తరకం మోసగాళ్లు వచ్చారు. డబ్బులు అవసరం ఉన్నాయని..మా దగ్గరున్న బంగారు నగల్ని తక్కువ ధరకు అమ్ముతున్నామని చెప్పి జనాన్ని నమ్మిస్తున్నారు. అత్యాశకు పోయిన వాళ్లను నిలువునా ముంచి డబ్బుతో ఉడాయిస్తున్న మొగుడు,పెళ్లాన్ని నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

ఇంకా చదవండి ...
  (P.Mahendar,News18,Nizamabad)
  బంగారం అంటే ఎవరికైనా ఇష్టమే. రోజు రోజుకు గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని అంటుతుండటంతో ..ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందా అని ఆశపడే వాళ్లు లేకపోలేదు. అలాంటి వాళ్లను ఆసరాగా చేసుకొనే ఓ కేడీ జంట నకిలీ బంగారం(Fake gold)అంటగట్టీ డ‌బ్బుల‌తో ఉడాయించాయిచారు. మోసపోయిన బాధితుడు పోలీస్ కంప్లైంట్(Police compliant)ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. నిజామాబాద్(Nizamabad)జిల్లా మాక్లూర్(Maclure)మండలం సాట్లాపూర్‌ (Satlapur)గ్రామానికి చెందిన లకావత్ రాములు(Lakawat Ramulu)అనే వ్యక్తిని కార్రెద్దుల‌ మాల్యాద్రి(Karreddula Malayadri)అతని భార్య సుభాషిణి(Subhashini)కలిసి మోసం చేశారు.

  కేడీ జోడి మోసం..
  నెల్లూరు జిల్లా సంగెం ప్రాంతానికి చెందిన మాల్యాద్రి, సుబాషిణిలు ఈ నెల 7వ తేదిన రాములుని కలిశారు. మంచిగా మాట్లాడినట్లుగా నటిస్తూ తమకు డబ్బు అవసరం ఉందని చెప్పారు. ఎవరైనా తమకు డబ్బులు సర్ధితే తమ దగ్గరున్న 30 తులాల బంగారు వడ్డాణం అమ్ముతామంటూ ఓ స్టోరీ అల్లారు. కేడీ దంపతులు వేసిన ఉచ్చులో పడిపోయాడు రాములు. వాళ్లు చెప్పింది నిజమేనని నమ్మి తక్కువ ధరకు 30తులాల బంగారు వడ్డాణం వస్తుందని ఆశ పడ్డాడు. వడ్డాణం తీసుకొని 5 లక్షల 40వేల రూపాయలు ఇవ్వమని మాల్యాద్రి దంపతులు కోరడంతో రాములు డబ్బులు ఇచ్చి వడ్డాణం తీసుకున్నాడు.  అసలు పేరుతో నకిలీ అంటగట్టే బ్యాచ్..
  ఈ మొత్తం ఎపిసోడ్‌లో రాములుకు వడ్డాణం ఇచ్చి ..డబ్బులు తీసుకున్న కేడీ దంపతులు అతనికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి అక్కడి నుంచి పారిపోయారు. మత్తు వదిలిన తర్వాత బంగారు ఆభరణం చూసుకున్న రాములు అది గోల్డ్ కాదని నకిలీ తెలుసుకొని వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని గ్రామంలోని సీసీ ఫుటేజ్, ఫోన్ నెంబర్, టీవీఎస్‌ మోపెడ్‌ వాహనం నెంబర్‌ ఆదారంగా కేసును చేధించారు.

  ఇది చదవండి : పెద్దపల్లి జిల్లాలో రైతుకు కాసుల వర్షం కురిపిస్తున్న ఎర్రమామిడి..దాని డిమాండే అంత  వామ్మో ఖతర్నాక్ దొంగలు..
  నిందితులు మాల్యాద్రి, సుభాషిణిని పోలీసులు పట్టుకున్నారు. అమాయకులు, తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయాలనే వాళ్లను టార్గెట్‌గా చేసుకొని ఈ కేడీ దంపతులు ఇదే తరహాలో గతంలో కూడా పలు మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన కేడీ జోడి దగ్గర నుంచి 2లక్షల 22వేలు స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీపీ వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. నిందితుల్ని పట్టుకోవడంలో సీఐ నరేష్, ఎస్సై యాదగిరి, సిబ్బందిని ఆయన అభినందించి, రివార్డులు అందజేశారు. ఎవరైనా బంగారం తక్కువ ధరకు ఇస్తామంటే నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అత్యాశకుపోతే ఇలాగే పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

  ఇది చదవండి: ములుగు జిల్లాలో కోట్లు ఖర్చు చేసి కట్టిన వంతెనలు..ఎలా ఉన్నాయో చూడండి


  Published by:Siva Nanduri
  First published:

  Tags: Crime news, Nizamabad District

  తదుపరి వార్తలు