Home /News /telangana /

NIZAMABAD CONGRESS LEADERS ATTACKED EACH OTHER WITH STICKS DURING RACHABANDA EVENT IN KAMAREDDY NZB PRV

Congress: కాంగ్రెస్ పార్టీలో మరోసారి భగ్గుమన్న వ‌ర్గ పోరు.. రచ్చబండలో క‌ర్ర‌ల‌తో దాడి..

కాంగ్రెస్​ నేతల గొడవలు

కాంగ్రెస్​ నేతల గొడవలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా త‌యారైంది.  ఓ ప‌క్క పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు రేవంత్ కృషి చేస్తుంటే మరో చోట పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాటాలు బ‌య‌ట ప‌డుతున్నాయి.

    తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీ ప‌రిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా త‌యారైంది.  ఓ ప‌క్క పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి (Revanth reddy) త‌న వంతు కృషి చేస్తుంటే మరో చోట పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాటాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. తాజాగా కామారెడ్డి (Kamareddy) జిల్లాలో  కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మళ్ళీ బట్టబయలైంది.  రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ మదన్ మోహన్, సుభాష్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ ఏర్పడింది.. క‌ర్ర‌లు , రాడ్ల‌తో ప‌రస్ప‌రం దాడుల‌కు దిగారు.

    కామారెడ్డి (Kamareddy) జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మళ్లీ రచ్చకెక్కింది. రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి తండాలో రచ్చబండ రచ్చరచ్చగా మారింది. మరోసారి ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ పార్టీ  నేత సుభాష్ రెడ్డి,  జ‌హిరాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు (Congress party leaders) మ‌ద‌న్ మోహన్ రావు వర్గీయులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. ఇటీవల కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్, మదన్ మోహన్ రావు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపిస్తూ పార్టీ నుంచి సస్పెండ్​ చేసినట్లు ప్ర‌క‌టించారు.



    అయితే మదన్ మోహన్ రావుపై పీసీసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మ‌ద‌న్ మోహ‌న్ వ‌ర్గీయులు రచ్చ బండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూండ‌గా.. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్ సుభాష్ రెడ్డి వర్గీయులు అక్కడకు రావడంతో గొడవ మొదలైంది. దీంతో  సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ వర్గీయుల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఘర్షణలో గాయపడ్డ వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    ధ్వంసమైన కారు


    పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎదుటే..

    గతంలో ఎల్లారెడ్డిలో జరిగిన సభలో ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎదుటే సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావుల మధ్య వర్గ పోరు బహిరంగమైంది. ఒకరి వర్గం వారు మరో వర్గం ఫ్లెక్సీలు చింపేశారు. మదన్ మోహన్ రావు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీగా పోటీ చేశారు. స్వల్ప మెజార్టీతో మదన్ మోహన్ రావు ఓటమి చెందారు. అయితే అప్పటి నుంచి మదన్ మోహ‌న్ రావు ఎల్లారెడ్డి నియోజక వర్గంపై కన్నేశారు. గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జాజుల సురేంధర్ పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గం పై సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు కన్నేశారు. ఇద్దరు ఎవరికి వారే ఎల్లారెడ్డి నియోజకవర్గం లో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఇరువర్గాలకు మింగుడు పడటం లేదు. మదన్ మోహన్ రావు పార్టీ నాయకులకు సమాచారం లేకుండా సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారన్న కారణంతో కామారెడ్డి జిల్లాలోని ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇంఛార్జీలు, పార్టీ సీనియర్ నాయకులు షబ్బిర్ అలీ సైతం మదన్ మోహన్ రావు తీరు పై మండిప‌డుతున్నట్లు సమాచారం.

    గతంలోనే సస్పెండ్​..?

    అయితే కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ పార్టీ నుంచి మదన్ మోహన్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు గ‌తంలోనే ప్రకటించారు. ఈ ఇష్యుపై ఇప్పటికే పీసీసీలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశం పై పీసీసీ ఇంకా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు.. అయితే ఇవాళ ఎల్లారెడ్డి పల్లి తండాలో జరిగిన రచ్చ బండలో మరోసారి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మ‌రో యేడాదిలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు రానున్నాయి.. అయితే అదికార తెరాసాకు దీటుగా కాంగ్రెస్ బ‌ల ప‌డుతుంది అనుకునే లోపు అంత‌ర్గ‌త కుమ్ములాట కార‌ణంగా నిరుగారిపోతుంద రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.. మొద‌ట కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల్లో యూనిటి వ‌స్తే పార్టీ బల‌ప‌డుతుంద‌ని రాజ‌కీ విశేలేష‌కులు అంటున్నారు.. ఆ దిశ‌గా పార్టీ అధిష్టానం చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది..
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Kamareddy, Revanth Reddy, TS Congress

    తదుపరి వార్తలు