తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో కేసీఆర్ (Cm Kcr) ప్రసంగించారు. ఈ సందర్బంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) చేసిన అభివృద్ధిపై సీఎం ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై చేపట్టిన ఉద్యమ సమయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పోచారం చిన్నపిల్లాడిగా మారుడతాడని అన్నారు. పోచారం తనకు అత్యంత ఆత్మీయుడు..ఆయన ఎవరి దగ్గరైన దైర్యంగా మాట్లాడగలుగుతారని కేసీఆర్ అన్నారు.
ఈ క్రమంలో బాన్సువాడ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లు..అలాగే సీఎం ప్రత్యేక నిధి నుండి నియోజకవర్గానికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ సందర్బంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమైక్య రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం..తెలంగాణ ఏర్పాటుతోనే ఈ బాధలు తొలగిపోయనే ఉద్యమ బాట పట్టామని అన్నారు.
CM Sri KCR addressing a public meeting at Thimmapur, Banswada Constituency after visiting Sri Venkateswara Swamy temple. https://t.co/4NUQZldAzr
— Telangana CMO (@TelanganaCMO) March 1, 2023
ఇక గతంలో ఇక్కడ బహిరంగ సభకు వస్తున్నప్పుడు పచ్చని పొలాలు, మొక్కజొన్న పంట కనిపించాయి. ఎండాకాలంలో కూడా ఇలా పంటలు ఎలా పండిస్తున్నారని తాను అడిగాను. దానికి వారు మాకు పోచారం శ్రీనివాస్ అన్ని విధాల నీటి సౌకర్యం కల్పించారని అక్కడి ప్రజలు చెప్పారని కేసీఆర్ అన్నారు. అంతలా నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతారని అన్నారు. ఇప్పుడు ఓ 60 ఏళ్ళుంటాయి. ఇంచుమించు నా వయస్సు అంతే అని కేసీఆర్ చెబుతూ మరోసారి బాన్సువాడలో పోచారం నిలబడాలని సీఎం అన్నారు. దీనితో సభలో ఒక్కసారిగా నవ్వులు పండాయి.
ఆలయానికి పూజల కోసం వస్తున్న క్రమంలో దారిలో ఉన్న ఏ దారి ఎంతదూరం ఉంది. రోడ్లు ఎక్కడెక్కడ వేశారు. అభివృద్ధి పనులు ఏమేమి జరిగాయి అని పోచారం విచారించారని సీఎం అన్నారు. ఆయనకు నియోజకవర్గంపై మూలమూల తెలుసని కేసీఆర్ అన్నారు. గతంలో ఈ ఆలయం సాదాసీదాగా ఉండేదని..ఇప్పుడు అభివృద్ధి చెందినా కూడా మరింత అభివృద్ధి కోసం రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.