Home /News /telangana /

NIZAMABAD CITY BUSSES STARTED IN NIZAMABAD CITY AFTER 30 YEARS AND CITY DEVELOPING FAST DISTRICT BUSSES NOT ENOUGH RTC CHAIRMAN QUOTED NZB PRV

City busses: ఆర్టీసీ మరో ముందడుగు.. ముప్పై యేళ్ల త‌రువాత ఆ న‌గ‌రంలో సిటీ బ‌స్సులు ప్రారంభం..   

సిటీ బస్సులో ప్రయాణిస్తున్న బాజిరెడ్డి,  ఎమ్మెల్యే గణేశ్​

సిటీ బస్సులో ప్రయాణిస్తున్న బాజిరెడ్డి, ఎమ్మెల్యే గణేశ్​

ఏ పెద్దనగరమైనా రావాణా సౌకర్యం అత్యావశ్యకం, కానీ, తెలంగాణలోని ఓ నగరంలో ఏళ్లుగా సిటీ బస్సులు నడవలేదు. కానీ, 30 ఏళ్ల తర్వాత సిటీ బస్సు రోడ్డెక్కింది. ఆ నగరం ఏంటి.. ఆ విశేషాలు ఏంటి? ఒకసారి తెలుసుకుందాం..

    ఏ పెద్దనగరమైనా రావాణా సౌకర్యం అత్యావశ్యకం, కానీ, తెలంగాణలోని ఓ నగరంలో ఏళ్లుగా సిటీ బస్సులు నడవలేదు. కానీ, 30 ఏళ్ల తర్వాత సిటీ బస్సు రోడ్డెక్కింది. ఆ నగరం ఏంటి.. ఆ విశేషాలు ఏంటి? ఒకసారి తెలుసుకుందాం.. నిజామాబాద్ (Nizamabad) నగరంలో 30 ఏళ్ల తర్వాత సిటీ బస్సులు (City busses) తిరిగి ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ నగర ప్రజలకు ఆర్టీసీ సేవలను (RTS) అందించేందుకు  ఈరోజు న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ (RTC Chairman Bajireddy Goverdhan) , అర్బన్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేష్ గుప్త తో కలిసి ప్రారంభించారు.  ఈ కార్యక్రమానిన బాజిరెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ.. 30 యేళ్ల క్రితం నిజామాబాద్ న‌గ‌రంలో ప్రైవేట్ సిటి బ‌స్సులు న‌డిచేవి.  అయితే పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు న‌గ‌రంలో ప్రయాణం  (Journey) క‌ష్టంగా మారింది. దీంతో వారి సౌక‌ర్య‌ర్ధం టీసీ బ‌స్సులు ఏర్పాటు చేశామ‌న్నారు. న‌గ‌రంలో నాలుగు రూట్ల‌లో ప్రయాణం చేసే విధంగా రూట్లు ఏర్పాటు చేశామ‌న్నారు. మూతపడే ఆర్టీసీ సంస్థకు తనను  చైర్మన్ చేశారని ప్ర‌తి ప‌క్ష‌లు ప్రచారం చేశాయి. కానీ వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు బాజిరెడ్డి.

    అభివృద్ధి బాటలో నగరం..

    ఆర్టీసీలో ప్రయాణం (RTC journey) సుర‌క్షితం అని ఆర్టీసీ చైర్మ‌న్ బాజీ రెడ్డి గోవ‌ర్ద‌న్ అన్నారు. మధ్యతరగతి, పేద ప్ర‌జ‌ల సౌక‌ర్యార్ధం 10 నుంచి 20 రూపాయాలు మాత్ర‌మే టికెట్ ధ‌ర అన్నారు.   ప్రస్తుత బస్టాండ్ నగర అభివృద్ధి చెందడంతో స‌రిపోవడం లేదు.. ఇత‌ర జిల్లాల నుంచి వ‌చ్చే బ‌స్సులు కూడా ఎక్క‌వ య్యాయి.. అయితే నేను ఆర్బ‌న్ ఎమ్మెల్యే బిగాల క‌లిసి మాట్లాడుకుని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాం.. ప్ర‌స్థుతం ఉన్న బ‌స్టాండ్ ముడున్న‌ర ఎక‌రాల్లో ఉంది.  రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థ‌లం ఐదు ఎక‌రాలు ఉంది.. ఆ స్థలం అయితే బాగుంటుంద‌ని సీఎం కేసీఆర్ కు ప్ర‌తిపాద‌న‌లు పంపామన్నారు. ప్ర‌జ‌ల సౌక‌ర్యం కొసం బస్టాండ్ ను నిర్మిస్తామ‌ని.. ఆ నిర్మాణం నా హయాంలో జ‌రగాల‌ని కోరుకుటున్నా అన్నారు.  ఆర్టీసీ సేవల‌ను మ‌రింత‌  విస్తారిస్తామ‌ని  చైర్మ‌న్ బాజిరెడ్డి హామీ ఇచ్చారు.

    అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. నిజామాబాద్ ప్రజలకు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. నగరంలో నాలుగు ప్రధాన రహదారుల పై రూట్లను తీసే సిటీ బస్సు నడుపుతున్నామన్నారు. నగరం ప్రజల చిరకాల వాంఛ సిటీ బస్సులు నడిపే అవకాశం తన హయాంలో సాకారం అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: City buses, Nizamabad

    తదుపరి వార్తలు