(P.Mahendar,News18,Nizamabad)
ఒంటరిగా ఉన్న ఆమె నిస్సహాయత, కష్టాన్ని అతను అకాశంగా మార్చుకున్నాడు. ప్రేమ అనే మాయ మాటలతో దగ్గరయ్యాడు. భర్త చనిపోయి.. గర్భవతిగా ఉన్న ఆమెకు కొత్త జీవితాన్ని ఇస్తానంటూ శారీరకంగా లోబర్చుకున్నాడు. మరో బిడ్డకు తల్లిని చేసి ఇప్పుడు ముఖం చాటేశాడు. భర్త చనిపోయి..ప్రియుడు మోసం చేయడంతో రోడ్డున బడ్డ బాధితురాలు న్యాయం కోసం పసిబిడ్డతో పోరాటం చేస్తోంది. ఏ తోడు లేని మహిళను ఓ మగాడు మోసం చేసిన ఘటన నిజామాబాద్Nizamabad జిల్లాలో చోటు చేసుకుంది. సిరికొండ(Sirikonda)మండలానికి చెందిన మధులత (Madhulatha)ధీనగాధ ఇది.
భర్త చనిపోయిన మహిళను..
కమ్మర్‌పల్లి మండలం కోనాసముందర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. మధులత గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె భర్త చనిపోయాడు. దాంతో కోనాసముందర్ గ్రామానికి చెందిన చెంగల రాజేష్‌తో మధులతకు పరిచయం ఏర్పడింది. మధులతకు పాప పుట్టిన తర్వాత రాజేష్‌కి దగ్గరైంది మధులత. అతను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పడంతో శారీరకంగా దగ్గరయ్యాడు. ఆల్రెడీ వివాహితుడిగా ఉన్న రాజేష్ తన భార్యకు విడాకులిచ్చి మధులతను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మింది. ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించడంతో మరో బాబుకు జన్మనిచ్చింది బాధితురాలు.
మరో బిడ్డకు తల్లిని చేశాడు..
అంతే కాదు ప్రియుడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంతో ఆరు లక్షల రూపాయలు ఇప్పించింది. మధులత మరో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నుంచి రాజేష్ అమెను కలవడం మానేశాడు. దూరం పెడుతూ వచ్చాడు. పెళ్లి చేసుకోమని మధులత కోరడంతో పట్టించుకోలేదు. ప్రియుడి చేతిలో మోసపోయినట్లుగా భావించిన బాధితురాలు తనకు న్యాయం చేయమని గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. ప్రియుడు రాజేష్‌తో వివాహం జరిగేలా చూడాలని లేదంటే తన బిడ్డతో ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు దిగింది.
పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు..
మధులత ఆందోళన చేస్తున్న విషయాన్ని పంచాయితీ కార్యాలయం సిబ్బంది పోలీసులకు చేరవేశారు. ఘటన స్తలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలు మధులతకు న్యాయం చేస్తామని మోసం చేసిన రాజేష్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించింది. భర్త లేక ప్రియుడి చేతిలో దగా పడిన మధులతతో పాటు ఆమెకు పుట్టిన ఇద్దరు బిడ్డలకు న్యాయం చేయాలని..ఆమె కుటుంబానికి అండగా నిలిచే విధంగా ప్రియుడు రాజేష్‌తో వివాహం జరిపించాలని స్థానిక మహిళ సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Extra marital affair, Lover cheating, Nizamabad, Telangana