(P.Mahendar,News18,Nizamabad)
నిజామాబాద్(Nizamabad)జిల్లాలో వలస కూలీలను మోసం చేస్తున్న దళారులు,మోసానికి కాదేది ఆనర్హం అన్నట్టుగా ఉంది. పొట్ట కూటి కోసం రాష్ట్రం దాటి వరి నాటు వేసేందుకు వచ్చిన కూలీలను ఏజెంట్(Agent)మోసం చేసారు. రెండు నెలల పాటు వరినాట్లు (Paddy fields)వేసిన కూలీల(Laborers)కు డబ్బులు ఇవ్వకుండా మధ్యవర్తి మాయం కావడంతో కూలీలు సొంతూరుకు వెళ్లేందుకు చేతిలో డబ్బుల్లేక అవస్థలు పడుతున్నారు. పశ్చిమ బెంగల్(West Bengal)కు చెందిన 80మంది కూలీలు 60 రోజుల కూలీ డబ్బులు సుమారు 11లక్షల రూపాయలు(11Lakhs)ఇవ్వకుండా ముఖం చాటేసిన ఏజెంట్ని పట్టుకొని తమకు పని చేసిన కూలీ డబ్బులు ఇప్పించమని పోలీసు(Police)లను వేడుకుంటున్నారు వలస కూలీలు.
వరినాట్ల కూలీల శ్రమ దోపిడీ ..
నిజామాబాద్ జిల్లా బోదన్ డివిజన్ పరిదిలోని బోదన్, ఎడపల్లి, రెంజర్ల మండలాల్లో వరి నాటు వేసేందుకు పశ్చింబెంగల్కు చెందిన 80మంది కూలీలు వచ్చారు. అయితే పశ్చిమబెంగల్ కు చెందిన కూలీలను కర్నాటకకు చెందిన మధ్యవర్తి సుషన్ అనే వ్యక్తి రెంజల్ మండలం దండిగుట్ట, బోధన్ మండలం బర్దీపూర్ చెందిన ఇద్దరు ఏజెంట్లకు అప్పగించారు. వీరు రెంజల్, ఎడపల్లి, బోధన్, కోటగిరి మండలాల్లో 600 ఎకరాలకుపైగా వరి నాట్లు వేయించారు. అయితే ఎకరాకు 4వేల 5వందలు తీసుకుంటారు. ఇందులో నుంచి వేయి రూపాయలు కమీషన్ ఏజెంట్లు తీసుకుంటారు. మిగిలిన డబ్బులు కూలీలకు ఇస్తారు. ఇదీ ఇక్కడి ఒప్పందం.
కూలీల కడుపుకొట్టాడు..
కూలీల అవసరాల కోసం కొంత డబ్బు ఇచ్చారు. రైతులకు ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులో ఏజెంట్ 11 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ డబ్బులు కూలీలకు రావల్సి ఉంది. కర్నాటకకు చెందిన సుషన్తో పాటు కూలీలు దండిగుట్టకు చేరుకొని ఏజెంటు కోసం వాకబు చేయగా పత్తా లేకుండా పోయాడు. ఆయన హైదరాబాద్లో ఉంటూ ఫోన్లో మాట్లాడుతూ నాట్లు వేయించుకున్న రైతుల నుంచి డబ్బును డైరెక్టుగా తన ఖాతాలో వేయించుకున్నాడు. దండిగుట్టలో బంధువులు ఉండటంతో ఇక్కడకు తీసుకొచ్చి మోసగించాడని తెలుకున్న కూలీలు నివ్వెరపోయారు.
దళారుల్లో దగాకోరులు..
తమకు జరిగిన అన్యాయాన్ని రెంజల్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎలాగైనా కష్టపడిన తమ సొమ్మును తమకు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. పొట్టకూటి కోసం పశ్చిమబెంగల్, ఉత్తరప్రదేశ్ , బిహార్, మహారాష్ట్ర నుంచి ఏటా వానాకాలం.. యాసంగి లో నాట్లేసేందుకు వేల మంది కూలీలు తెలంగాణకు వస్తారు. కొందరు మధ్యవర్తులు కూలీలను తమ ప్రాంతాలకు తీసుకొచ్చి వసతి కల్పిస్తూ వారితో ఎకరం నాటు వేయించేందుకు రూ.3,500 ఒప్పందం కుదుర్చుకొని రైతుల వద్ద రూ.4 వేలు, రూ.4,500 ల వరకు వసూలు చేస్తున్నారు. వారి శ్రమను దోచుకోవడంతో పాటు కూలీ డబ్బుల చెల్లించకుండా మోసం చేయడంతో అయోమయంలో పడ్డారు. కష్టార్జితం పోవడమే కాకుండా తిరిగి స్వగ్రామాలకు వెళ్లేందుకు కనీసం ఛార్జీలకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad, Telangana crime news