(P.Mahendar,News18,Nizamabad)
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే వారి పెళ్లికి అమ్మాయి తరపు పెద్దలు అంగీకరించలేదు. ప్రేమించిన యువతితో పెళ్లి కావడం లేదని బాధను భరించలేకపోయాడు ప్రేమికుడు. ఇంట్లో వాళ్లకు తన బాధ చెప్పుకోలేక .. ప్రేమించిన అమ్మాయిని వదిలి ఉండలేకపోయాడు. కామారెడ్డి(Kamareddy)జిల్లాలో ఓ యువకుడు ప్రేమ వివాహం
(Love marriage)జరగలేదనే మనస్తాపంతో చేసిన పనికి ఇంట్లో వాళ్లే కాదు గ్రామస్తులు సైతం షాక్ అయ్యారు. రెండు మనసుల్ని కలిపిన ప్రేమ ..చివరకు ప్రాణాలు తీసేంతగా బాధిస్తుందా అని విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణం తీసిన ప్రేమ..
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఎల్లేశం అనే పాతికేళ్ల వయసున్న యువకుడు దోమకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ఇష్టపడ్డాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఇద్దరికి ఒకరిపై మరొకరికి ప్రేమ పుట్టింది. గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అదే విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎల్లేశం యువతిని ప్రేమిస్తున్న విషయం అతని తండ్రి ఎల్లయ్యకు తెలియడంతో అక్టోబర్ 20వ తేదిన అమ్మాయి తల్లిదండ్రుల్ని సంప్రదించాడు.
పెళ్లికి ఒప్పుకోలేదనే బాధతో..
ఎల్లేశంతో ప్రేమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈవిషయం తెలుకున్న యువకుడు అక్టోబర్ 27న గ్రామ శివారులోని రామయ్యకుంట వద్దకు వెళ్లి తన స్నేహితుడైన నందుకు ఫోన్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. నందు అదే విషయాన్ని ఎల్లేశం తండ్రి ఎల్లయ్యకు చెప్పి ఘటన స్తలానికి వెళ్లేలోపే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఎల్లేశం. వెంటనే అతడ్ని రామాయంపేట ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సలహా మేరకు ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎల్లేశం మృతి చెందాడు. తన కొడుకు మృతికి కారణం ప్రేమించిన అమ్మాయి ఆమె మేనమామ అంటూ ఎల్లయ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నష్టపోయిన తల్లిదండ్రులు..
నవమాసాలు మోసి..పాతికేళ్లు పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని కాదని ఒక అమ్మాయి కోసం నూరేళ్ల జీవితాన్ని త్యాగం చేసుకోవడంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ప్రేమ అనే పదానికి ప్రాణాలు తీసుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అన్యాయం చేయడం ఎంత వరకు కరెక్టో ఒకసారి యువత ఆలోచించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పెళ్లికి ఒప్పుకోలేదనే బాధతో కొడుకు కన్నీటిని మిగిల్చిన తల్లిదండ్రులను చూసి గ్రామస్తులు జాలి పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamareddy, Love failure, Telangana News