Home /News /telangana /

NIZAMABAD BOY COMMITTED SUICIDE IN NIZAMABAD DISTRICT FOR NOT BUYING A BICYCLE SNR NZB

Nizamabad:తండ్రి సైకిల్ కొనివ్వలేదట..ఆ కొడుకు ఏం చేశాడంటే..

(సైకిల్‌ కోసం సూసైడ్)

(సైకిల్‌ కోసం సూసైడ్)

Nizamabad:తాను అడిగింది కొనివ్వలేదని 11ఏళ్ల బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి మాటలతో మనస్తాపానికి గురై ఇంట్లోంచి వెళ్లిపోయి చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. బాలుడు కోరిన ఆ చిన్న కోరిక ఏంటో తెలుసా.

    (P.Mahendar,News18,Nizamabad)
    పిల్లల మనసు చాలా సున్నితమైనది. చిన్న విషయాలకే గాయపడుతుంది. అందుకే పిల్లలు ఏదానా కావాలని మారం చేసినా.. కొనివ్వమని ఏడ్చినా ఒక్కసారితో వదలరు. కోరింది ఇచ్చే వరకు పట్టుబడతారు. పంతానికి పోతారు. కొందరైతే ప్రాణాలు కూడా తీసుకుంటారు. నిజామాబాద్(Nizamabad)జిల్లాలో కూడా అలాంటి ఘటనే జరిగింది. జిల్లాలోని క‌మ్మ‌ర్‌ప‌ల్లి(Kammaripally)మండ‌ల కేంద్రంలోని గాంధీ నగర్ కాలనీ(Gandhi Nagar Colony)కి చెందిన 11సంవత్సరాల టేకు విజయ్‌కుమార్‌ (Vijaykumar)అనే బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈనెల 7వ తేదిన ఇంట్లో ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకు విజయ్‌కుమార్ ఇంటికి రాకపోవడంతో తండ్రి టేకు సతీష్‌(Satish)తో పాటు కుటుంబ సభ్యులు కాలనీలో వెదికారు. చుట్టు పక్కల ప్రాంతాలన్ని గాలించారు. జాడ దొరక్కపోవడంతో ఫ్రెండ్స్, చుట్టాల ఇంటికి దగ్గర గాలించారు ఆచూకీ లభించలేదు. బిడ్డ కనిపించకపోవడంతో తండ్రి స‌తీష్ పోలీస్ కంప్లైంట్(Police compliant) ఇచ్చాడు. మిస్సింగ్ కేసు(Missing case)నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలించారు. ఇంట్లో ఆడుకోవడానికి అని చెప్పి బయటకువెళ్లిన విజయ్‌కుమార్ అదృశ్యం కావడానికి కారణం ఏమిటంటే తనకు సైకిల్‌ కొనివ్వమని తండ్రిని గత కొన్ని రోజులుగా అడుకుతున్నాడు. అందుకు తండ్రి సతీష్‌ డబ్బులు లేవని తర్వాత కొనిస్తానంటూ సర్ది చెబుతూ వచ్చాడు. ఈక్రమంలోనే ఈెనెల 7వ తేది రోజున ఏడవ తరగతి చదువుతున్న విజయ్‌కుమార్ తండ్రిని సైకిల్‌ (Cycle‌)కొనివ్వాల్సిందేనంటూ పట్టుబట్టాడు. తండ్రి గట్టిగా మందలించడంతో బాలుడు మనస్థాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

    సైకిల్ కోసం బాలుడు బలి..
    ఇంట్లోంచి వెళ్లిన విజయ్‌కుమారు బుధ‌వారం సాయంత్రం అదే కాలనీ శివారులోని పాడు బ‌డ్డ‌ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని స్థానికుల‌కు క‌నిపించాడు. వెంటనే గ్రామస్తులు తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిన బిడ్డ చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించడం చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. బోరున విలపించారు. పోలీసులు సైతం ఘటన స్తలానికి చేరుకొని తప్పిపోయిన బాలుడిగా నిర్ధారించుకొని సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను తల్లిదండ్రుల్ని అడిగితెలసుకున్నారు.

    (సైకిల్‌ కోసం సూసైడ్)
    (సైకిల్‌ కోసం సూసైడ్)


    చిన్న మనసు గాయపడి..
    సైకిల్ కొనివ్వలేదని 11ఏళ్ల బాలుడు తల్లిదండ్రులపై అలిగి ప్రాణాలు తీసుకోవడం గ్రామస్తుల్ని తీవ్రంగా కలచివేసింది. సంఘటన స్తలంలో బిడ్డ కోసం తల్లిదండ్రులు చేస్తున్న ఆర్తనాదాలు వినిలేకపోయారు. పోలీసులు సైతం ఫార్మాలిటిసీ పూర్తి చేసి విజ‌య్ కుమార్ మృతదేహాన్ని చెట్టు నుంచి తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Nizamabad, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు