• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • NIZAMABAD BJP MP DHARMAPURI ARVIND INTERESTING COMMENTS ON YS SHARMILA POLITICAL PARTY AK

YS Sharmila: షర్మిల కొత్త పార్టీపై బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila Dharmapuri Arvind: తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వైఎస్ షర్మిల అనవసరంగా సమయం వృథా చేసుకుంటున్నారని ఎంపీ అరవింద్ అన్నారు.

  • Share this:
    వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీపై తెలంగాణలోని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. తాజాగా ఆమె కొత్త పార్టీ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏర్టు చేయబోయే కొత్త పార్టీ పార్టీ హల్లేలూయా పార్టీ అని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తామన్న షర్మిల వ్యాఖ్యలపై ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదని.. రామ రాజ్యమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వైఎస్ షర్మిల అనవసరంగా సమయం వృథా చేసుకుంటున్నారని ఎంపీ అరవింద్ అన్నారు.

    తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్న వైఎస్ షర్మిల.. ఇందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతున్నారు. నేడు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమైన షర్మిల.. మీటింగ్‌కు వచ్చిన వారికి ఫీడ్ బ్యాక్ పేపర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఏ విధంగా ముందుకు సాగుతుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయంలో నేతల చెప్పిన దానికంటే క్షేత్రస్థాయిలో ఉంటే వైఎస్ఆర్ అభిమానుల నుంచే అభిప్రాయాలు తీసుకోవాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది.

    ఫీడ్ బ్యాక్ ఫామ్‌లో పేరు, చిరునామాను నింపడంతో పాటు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు. ఇందులో సుమారు 11 ప్రశ్నలు ఉన్నాయి. తాము ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే ఏం చెప్పాలి. రాష్ట్రంలో వైఎస్ఆర్ అభిమానులు ప్రస్తుతం ఎలాంటి కష్టాలు పడుతున్నారు. వాటిని ఎలా తీర్చాలి. మీ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏంటి ?. అసలు పార్టీ గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్, టీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలి. రాష్ట్రంలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నలు ఇందులో ఉన్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: