నిజామాబాద్(Nizamabad)జిల్లా రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. జిల్లాలో పసుపు బోర్డు(Yellow board)హామీ అంశం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ(Trs mlc) కల్వకుంట్ల కవిత(Kavitha) వర్సెస్ బీజేపీ ఎంపీ ధర్మపురి ఆర్వింద్కి మధ్య పోరుగా తయారైంది. గెలిచిన వారం రోజుల్లోనే పసుపు బోర్టు ఏర్పాటు చేస్తానంటూ లిఖిత పూర్వక హామీ ఇచ్చి గెలిచిన ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind)హామీని అమలు చేయకపోవడంపై జిల్లాకు చెందిన పసుపు రైతులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ , మాజీ ఎంపీ కవిత ఎంపీ అర్వింద్‌ని టార్గెట్ చేశారు. పసుపు బోర్డు తీసుకువస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చుకునే వరకూ అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు. రైతుల డిమాండ్‌కు కొనసాగింపుగానే ఎమ్మెల్సీ కవిత సైతం ఎంపి ఆర్వింద్‌పై ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు పూర్తవుతున్న..ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంపై మండిపడ్డారు. గెలిచిన నాటి నుంచి జిల్లాకు ఎలాంటి నిధులు తెచ్చారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు కవిత. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా పసుపు బోర్డు తేలేకపోయారని... రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోయారని ఎద్దెవా చేశారు.
వాగ్ధానం నెరవేర్చాల్సిందే..
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన ప్రశ్నలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఐదేళ్లు ఎంపిగా ఉండి కవిత రైతులకు ఏమీ చేయాలేదని..ఇప్పుడు పసుపు బోర్డు పేరుతో రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అంతే కాదు..రైతుల పేరుతో టీఆర్ఎస్ కర్యకర్తలే తమను అడ్డుకుంటున్నారని ఎంపి ఆర్వింద్ అంటున్నారు. ఆదివారం ఆర్మూర్ మండంలోని పెర్కిట్ గ్రామంలోని ఎంపి ఆర్వింద్ ఇంటి ఎదుట పసుపు రైతులు పసుపును పోసి నిరసన తెలిపారు.పసుపు బోర్డు తీసుకు వచ్చేవరకు అడ్డుకుంటామని ప్రకటించారు.శనివారం కుక్కునూరు వెళ్లకుండా ఎంపీని అడ్డుకున్నారు. తన పర్యటనను అడ్డుకుంటుంది రైతులు కాదని..టీఆర్ఎస్ శ్రేణులంటున్నారు ఎంపీ ఆర్వింద్. ఒక ఎంపీగా తన నియోజకవర్గంలో తిరిగే స్వేచ్ఛ తనకు లేదా అని ప్రశ్నించారు. సంబంధిత అధికారులపై మండిపడ్డారు. గతంలో తనపై జరిగిన దాడిపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. ప్రజాప్రతినిధైన తనకే రక్షణ లేకపోతే ఏలా అంటున్నారు అర్వింద్.
టీఆర్ఎస్ చేస్తున్న కుట్రేనన్న అర్వింద్..
2019 పార్ల మెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అర్వింద్ పసుపు బోర్డు తెస్తామన్న హామీతోనే కవితపై విజయం సాధించారు. అయితే గెలిచిన తర్వాత బోర్డు ఏర్పాటు అంశంపై రైతులు పలుమార్లు ఎంపీని అడుగుతున్నప్పటికి పసుపు బోర్డు సుగంద ద్రవ్యల బోర్డులో ఉందని అందుకే ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. పసుపు బోర్డుకు బదులుగా స్పైస్ బోర్డు తెచ్చామని దాని ద్వారా పసుపుకు గిట్టుబాటు ధర లభిస్తుందని సర్ది చెప్పుకొచ్చారు. కాని ఎన్నికల వాగ్ధానాన్ని మాత్రం రైతులు మర్చిపోవడం లేదు. ఎప్పుడు అర్వింద్ నిమాబాద్ జిల్లాకు వచ్చినా అడ్డుకొని తీరుతామనంటున్నారు. మీరు ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటారో లేక బ్రతిమిలాడుకుంటారో మాకు తెలియదు పసుపు బోర్డు తేవాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dharmapuri Arvind, Kalvakuntla Kavitha, Nizamabad District