Home /News /telangana /

NIZAMABAD BJP CHIEF BANDI SANJAY ARRESTED BY THE POLICE IN KAMAREDDY WHO WAS ON HIS WAY TO VISIT BASRA IIIT STUDENTS PRV

Bandi Sanjay Arrest: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అరెస్టు.. కామారెడ్డిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

బీజేపీ చీఫ్ బండి సంజయ్

బీజేపీ చీఫ్ బండి సంజయ్

BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay ను శుక్రవారం నాడు కామారెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. Basara IIIT ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

    కామారెడ్డి (Kamareddy) జిల్లాలో గురువారం టెన్షన్ వాతావరణం నెలకొంది.  తమ కాలేజీలో నెలకొన్న సమస్యలు తీర్చాలని గత మూడు రోజులుగాట ఆందోళన చేస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP chief Bandi Sanjay)  బాసరకు బయలుదేరారు. బండి సంజయ్ రాకతో పోలీసు శాఖ అలర్ట్ అయ్యింది. టోల్ ప్లాజా వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు టోల్ ప్లాజా వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే బండి సంజయని అదుపులోకి తీసుకుని (Bandi sanjay Arrest) బికనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.

    కరెంట్, నీళ్లు కట్ చేయడమేంటి?..

    ఈ సందర్భంగా విద్యార్థుల ఆందోళన చేస్తుంటే కరెంట్, నీళ్లు కట్ చేయడమేంటి? వాళ్లేమైన తీవ్రవాదులా అని బండి ప్రశ్నించారు. ‘‘విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన సీఎం సిల్లీ సమస్యలంటూ రెచ్చగొడతారా? సీఎం విద్యార్థులతో మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.. అని అన్నారు. సమస్యలు తెలుసుకోవాలని వెళితే అడ్డుకుంటారా?  అని పోలీసులను ప్రశ్నించారు బండి. ట్రిపుల్ ఐటీలో చదువుకునే వాళ్లంతా పేద విద్యార్థులేనని వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరడం తప్పా? అని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాడతామని ట్రిపుల్ ఐటీ వెళ్లి తీరుతనని బండి సంజయ్ అన్నారు.

    బండి సంజయ్​ అరెస్టు దృశ్యాలు


    అయితే బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేసే అవకాశం ఉండటంతో బీజేపీ నాయకుల వాహనాలను ముందుకు వెళ్లకుండా పోలీసులు వలయంగా ఏర్పడ్డారు .  కాగా, బండి సంజయ్ ను అడ్డుకోవడంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులను సంఘటన స్థలంలోంచి లాకెళ్లారు పోలీసులు. జాతీయ రహదారిపై బైటాయించిన బీజేపీ నాయకులు. పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    బండి సంజయ్​ కాన్వాయ్​ వద్ద బీజేపీ కార్యకర్తలు


    ఏం జరిగింది?

    చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చెంతన ఉన్న ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిబుల్ ఐటి (Basara IIIT) కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వివాదాలు, ఆందోళనలతో వార్తలకెక్కుతోంది. తాజాగా ట్రిబుల్ ఐటీ విద్యార్థులు మరోసారి రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు వేల సంఖ్యలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కళాశాల మెస్ ల లో భోజనం (Food) సరిగా ఉండటం లేదని, విద్యుత్ సమస్య (Power Issue), నీటి సమస్య (water Issue) తీవ్రంగా వెంటాడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు కనీసం ల్యాప్ టాప్ లు కూడా ఇవ్వకుండా చదువు పట్ల అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ బాసర త్రిబుల్ ఐటీ లోపల సుమారు ఆరు గంటలకు పైగా ఆందోళన (Protest) చేపట్టారు. రెగ్యులర్ వైస్ చాన్సలర్ ను నియమించడంతోపాటు పర్మినెంటు ఉద్యోగులను కూడా నియమించాలని, తాగునీటి సమస్యతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని, ల్యాప్ టాప్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా,గతంలోనూ విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Arrested, Bandi sanjay, Basara IIIT, Kamareddy

    తదుపరి వార్తలు