(P.Mahendar,News18,Nizamabad)
వాహనాలు నడిపే వాళ్లు నిబంధనలు పాటించకపోతే వారిపై కేసులు నమోదు చేయడమే పోలీసుల(Police) బాధ్యత. వాహనాల తనిఖీల సమయంలో ఎవరైనా దురుసుగా వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాని కేవలం ఓ బైకర్ (Biker)వాహనాల చెకింగ్ సమయంలో వాహనం ఆపలేదన్న కోపంతో నిజామాబాద్(Nizamabad)జిల్లాకి చెందిన ఓ ఎస్ఐ(SI)తన ప్రతాపం చూపించాడు. ధర్పల్లి(Dharpalli)మండలం ప్రాజెక్టు రామడుగు(Ramadugu)గ్రామానికి చెందిన పట్టేం శ్రీనివాస్(Pattem Srinivas)ప్రస్తుతం చెవు కర్ణభేరి దెబ్బతిని ఆసుపత్రిలో ట్రీట్మెంట్(Treatment)పొందుతున్నాడు. అసలు జరిగింది ఏమిటంటే గల్ఫ్ దేశం(Gulf country)నుండి సెలవుపై వచ్చాడు బాధితుడు శ్రీనివాస్.
ఎస్ఐ ఓవర్ యాక్షన్..
ఎస్ఐ కొట్టాడని చెప్పడంతో కొన్ని రోజులు మందులు వాడితే తగ్గుతుందని చెప్పారు. ఒకవేళ తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్ చెప్పి పంపించారు. డాక్టర్లు చెప్పిన దాంతో బాధితుడు శ్రీనివాస్ షాక్ అయ్యాడు. తనను అకారణంగా కొట్టారంటూ ఎస్ఐ వంశీకృష్ణపై హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. తాను పని మీద పొలానికి వెళ్తుంటే పోలీసులు ఆపారని వెంటనే వస్తానని చెప్పి వెళ్లి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి హోం గార్డ్తో మాట్లాడుతున్న సమయంలో ఎస్ఐ తనను కొట్టారని బైక్ పేపర్లు, లైసెన్స్ ఉన్నాయని చెప్పినా వినిపించుకోకుండా కొట్టారంటూ బాధితుడు వాపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad, Police Case, Telangana News