NIZAMABAD BANNED POPULAR FRONT OF INDIA ACTIVITIES ARE GOING ON IN NIZAMABAD AND TRAINING YOUNGSTERS IN THE NAME OF KARATE NZB PRV
Terrorists in Nizamabad: నిజామాబాద్‌లో ఉగ్రవాదుల కలకలం.. కరాటే పేరుతో 200 మందికి శిక్షణ?
మాట్లాడుతున్న పోలీసులు
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్యక్రమాలు సాగుతున్న విషయం వెలుగు చూడటంతో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు అలర్టయ్యాయి.
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్యక్రమాలు సాగుతున్న విషయం వెలుగు చూడటంతో ఉగ్ర కదలికలపై (Terrorism movements) కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు అలర్టయ్యాయి. ఈ విషయమై కేంద్ర నిఘా వర్గాలు కూడా సమాచారాన్ని సేకరిస్తున్నాయి., SIMI పై నిషేధం విధించడంతో పీఎఫ్ఐ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నిజామాబాద్ సీపీ నాగరాజు చెప్పారు. పీఎఫ్ఐ పేరుతో సుమారు 200 మంది శిక్షణ పొందినట్టుగా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల, కడప, నెల్లూరు, కర్నూల్, హైద్రాబాద్ ప్రాంతాలకు చెందిన వారు శిక్షణ పొందారని నిజామాబాద్ పోలీసుల విచారణలో తేలింది. సంస్థ శిక్షకుడు అయిన జగిత్యాల వాసి అబ్దుల్ ఖాదర్‌ను ఈ నెల 4న అరెస్టు చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయన్నారు.
దుబాయిలో పని చేసి..
ఖాదర్ స్వస్థలం జగిత్యాల (Jagityal) జిల్లా.. కొద్ది రోజులు దుబాయిలో పని చేసి ఇక్కడికి వచ్చి పీఎఫ్ ఐ లో చురుగ్గా పాల్గొంటున్నాడు.. కరాటే (Karate) ముసుగులో ఇప్పటికే వరంగల్ వెళ్లి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.. మతోన్మాదంతో ఉండే యువకులను సెలెక్ట్ చేసుకుని వారికి ఫండింగ్ ఇచ్చి వారిని రెచ్చగొట్టే విధంగా వారిని ట్రైనింగ్ ఇచ్చి వారిని సిద్ధం చేస్తారు. కాగా, వీళ్ల గుట్టు రట్టవడంతో పోలీసులు వీరిపై వివిధ సెక్షన్ల కిందా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
2017లో పీఎఫ్ఐలో చేరి..
ఖాదర్ సమాచారం మేరకు నిజామాబాద్ నగరానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అబ్దుల్ మొబిన్‌తోపాటు ఇక్కడి గుండారం గ్రామానికి చెందిన షేక్ సాదుల్లాను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. పీఎఫ్ఐ శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ అరెస్టవడంతో ఏం చేయాలన్న దానిపై మాట్లాడుకునేందుకు సాదుల్లా, ఇమ్రాన్, అబ్దుల్ మోబిన్ ఈ నెల 5న గుండారం గ్రామంలో కలిశారని.. ఆ సమయంలో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని పోలీసు బృందం వారిని అదుపులోకి తీసుకుందని సీపీ వివరించారు. సాదుల్లా 2017లో పీఎఫ్ఐలో చేరి.. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో క్రియాశీల సభ్యుడిగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు.
ఆర్థిక సాయం చేస్తామని చెప్పి..
పీఎఫ్ఐ శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ గతంలో గల్ఫ్‌కు వెళ్లి వచ్చి నిజామాబాద్‌లో నివాసం ఉంటున్నాడని వివరించారు. పీఎఫ్ఐ కీలక నేతలు ఖాదర్‌కు ఇంటి నిర్మాణం కోసం రూ.6 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి, ఆ సంస్థ సభ్యులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడం కోసం సంస్థలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఖాదర్ వరంగల్‌లో, పలు ఇతర ప్రాంతాల్లో కరాటే (Karate) పేరుతో యువకులకు శిక్షణ ఇచ్చాడని గుర్తించామన్నారు. గత ఆరు నెలలుగా ఖాదర్ నిజామాబాద్‌లోనే ఉంటూ తన ఇంటిపైనే పీఎఫ్ఐ కార్యకలాపాలపై శిక్షణ ఇస్తున్నాడని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో ఇలా శిక్షణ తీసుకున్న 200 మందిలో 23 మంది కీలక వ్యక్తులు ఉన్నట్టు గుర్తించామన్నారు. మిగతా వారిని సైతం అరెస్టు చేస్తామన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.