(P.Mahendar,News18,Nizamabad)
నిజామాబాద్(Nizamabad)జిల్లాలో భారీ చోరీ. ఏకంగా బ్యాంక్‌నే కొల్లగొట్టారు(Bank robbery)దొంగలు. అంతా పకడ్బందీగా సినిమా స్టైల్లో జరిగిపోయింది. జులాయి, మోసగాళ్లకు మోసగాడు సినిమా స్టైల్లో ఒకటి రెండు కాదు నాలుగున్నర కోట్ల సొమ్ము కాజేశారు కేటుగాళ్లు. రాబరీ జరిగిన విధానం చూస్తుంటే ఒకటి రెండ్రోజులు కాదు చాలా రోజులుగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు(Police) అనుమానిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ(Balkonda)నియోజకవర్గం మెండోర(Mendora)మండలంలోని బుస్సాపూర్(Bussapur)లాంటి జన సామర్ధ్యం తక్కువగా ఉన్న ప్రదేశాన్ని దొంగలు చోరీ చేయడానికి అనువైనదిగా సెలక్ట్ చేసుకున్నారు. బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(Telangana Grameen Bank)లో ఈ భారీ చోరీకి స్కెచ్‌ని అమలు చేశారు దేశముదుర్లు.
బ్యాంక్‌నే కొల్లగొట్టారు..
బ్యాంక్ లూటీ చేయడానికి వచ్చిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ముఖాలకు మాస్క్‌లు వేసుకొని బ్యాంక్ రాబరీకి పాల్పడ్డారు. ముందుగా బ్యాంక్ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అటుపై వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ సాయంతో బ్యాంక్ షట్టర్‌ని కట్ చేసి తెరిచారు. అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమును గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోపలికి చొరబడ్డారు. లాకర్లలో ఉన్న 7 లక్షల 30 వేల రూపాయల నగదు, 8.3 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఎత్తుకెళ్లిన బంగారు నగల విలువ సుమారు 3 కోట్లు ఉంటుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ రాబరీ అంతా శనివారం రాత్రి జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దోపిడీ చేస్తున్న సమయంలో చిన్న గ్యాస్ సిలిండర్, కట్టర్ మంటలకు లాకర్లో దాచిన కొన్ని నగదు పత్రాలు సైతం తగలబడిపోయాయి.
#BankRobbery in filmy style by an interstate gang, in #Telangana Grameena Bank at #Bussapur village in #Nizamabad dist, cctv damaged, used gas cutter to open the vault. About ₹ 7 lakh cash and documents gutted, about ₹ 3 cr worth pledged gold jewellery stolen.#MoneyHeist pic.twitter.com/lZ6hrA8L0Y
— Surya Reddy (@jsuryareddy) July 5, 2022
ఎక్కడా క్లూ దొరక్కకుండా రాబరీ..
బ్యాంకులోని అలారం సెన్సార్ శబ్ధం రాకుండా దాన్ని కూడా ధ్వంసం చేశారు. దొంగతనం చేసిన సీసీ కెమెరాకు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డును సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలంను నిజామబాద్ పోలీస్ కమిషనర్ కే అర్ నాగరాజు, అర్మూర్ ఏసీపీ ప్రభాకర్, ఇతర అధికారులు, సిబ్బంది పరిశీలించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో బ్యాంకులలో ఇంత పెద్దచోరీ జరగడం దశాబ్ద కాలంలో మొదటిసారి. బ్యాంకుల చోరీకు పాల్పడిన ముఠా కోసం పోలీస్ శాఖ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను చేపట్టింది. మరోవైపు బ్యాంకులో డబ్బులు ఉన్న ఒక లాకర్ ను మాత్రమే పగుల గొట్టారు. మరో లాకర్ లో రైతు బంధుకు చెందిన డబ్బులు ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana : షాద్‌నగర్‌లో పులి పేరుతో పులిహోర .. ఆశ్చర్యపోయిన అధికారులు, పోలీసులు
4.4కోట్ల రూపాయల సొత్తు మాయం..
సోమవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చి బ్యాంక్ షట్టర్లు తెరిచి ఉన్నట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంనూ రప్పించి వేలిముద్రలు సేకరించారు. ఈ దొంగతన శనివారం రాత్రి ఈ చోరీ జరిగినట్లుగా నిర్ధారించారు. తెలంగాణ బ్యాంక్ మ్యానేజన్ రాజెశ్ ఇచ్చిన పిర్యాదుతో బ్యాంక్ కు వచ్చి చూసామని సీపీ కేఆర్ నాగరాజు చెప్పారు.. ఇది బయట గ్యాంగ్ చేసినట్లుగా ఉందన్నారు. ఇందల్వాయిలో ఎటీఎం చోరీ ఘటనను తలపిస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన బ్యాంక్ రాబరీ ఘటన చూస్తుంటే బాగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా భావిస్తున్నారు. ఎక్కడ కూడా ఆనుమానం రాకుండా గ్యాస్ కట్టర్‌తో లాకర్‌ను తెరవడం, ముఖాలు గుర్తు పట్టకుండా మాస్క్‌లతో రావడం అంతా పక్కా సినిమాటిక్ స్టైల్లో ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Crime news, Nizamabad police