హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bank Robbery : బ్యాంకులో 8కేజీల గోల్డ్ మాయం .. మా బంగారం మాకివ్వమంటున్న తాకట్టు పెట్టిన కస్టమర్లు

Bank Robbery : బ్యాంకులో 8కేజీల గోల్డ్ మాయం .. మా బంగారం మాకివ్వమంటున్న తాకట్టు పెట్టిన కస్టమర్లు

NIZAMABAD BANK ROBBERY CASE

NIZAMABAD BANK ROBBERY CASE

Bank Robbery: బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 3నెలల క్రితం భారీ దొంగతనం జరిగింది. ఖాతాదారులు, గ్రామస్తులు బ్యాంకులో తాకట్టుపెట్టిన 8కేజీల బంగారంతో పాటు క్యాష్‌ని దోపిడీ ముఠా ఎత్తుకెళ్లారు. అయితే తాకట్టు పెట్టిన తమ బంగారం సంగతేంటని బాధితులు ధర్నా చేపట్టారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P.Mahendar,News18,Nizamabad)

  మూడు నెలల క్రితం తెలంగాణలోని నిజామాబాద్(Nizamabad)జిల్లాలో సినీ ఫక్కీలో బ్యాంక్ రాబరీ జరిగింది. అప్పట్లో ఈ వార్త కలకలం సృష్టించింది. భారీగా నగదుతో పాటు ఎనిమిది కేజీల బంగారు నగలను దోచుకెళ్లారు దొంగలు. మెండోరాMendora మండలం బుస్సాపూర్(Bussapur)గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(Telangana Grameen Bank)లో రాబరీ జరిగి దాదాపు మూడు నెలలు గడుస్తున్నప్పటికి నిందితులను పట్టుకోవటంలో పోలీసులు(Police)ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇంత వరకు దొంగల జాడ తెలియాలేదు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన బాధితులు మాత్రం తన నగల కోసం లబోదిబోమంటూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. తమ బంగారం తమకు ఇచ్చేయాలని బ్యాంక్(Bank)ఎదుట ఆందోళ‌న‌కు దిగారు.

  Viral news : అమ్మవారి విగ్రహం పాదల దగ్గర అజ్ఞాత భక్తుడి లేఖ .. ఏం కోరిక కోరాడో తెలిస్తే షాక్ అవుతారు

  3నెలలైనా పురోగతి లేదు..

  బుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మూడు నెలల క్రితం భారీ దొంగతనం జరిగింది. ఖాతాదారులు, గ్రామస్తులు బ్యాంకులో తాకట్టుపెట్టిన ఎనిమిది కేజీల బంగారంతో పాటు బ్యాంక్‌లోని క్యాష్‌ని దోపిడీ ముఠా ఎత్తుకెళ్లారు. ఈ విషయం ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. అయితే బ్యాంక్ రాబరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికీ నిందితుల్ని పట్టుకునే పనిలోనే ఉన్నారు. కాని తమ అవసరాల కోసం ఒంటిపైనున్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టీ ఆర్థిక రుణం తీసుకున్న వారు ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నారు.

  నగల కోసం బాధితులు ధర్నా..

  బ్యాంక్ దోపిడీలో బంగారం కోల్పోయిన బాధితులు తాము తాకట్టు పెట్టిన బంగారు ఆభ‌రాణాల‌ను తమకు తిరిగి ఇవ్వాలంటూ  బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగారు. సంఘటన జరిగి మూడు నెలలు కావస్తోంది. నిందితుల కోసం గాలిస్తున్న చర్యలు నీరు గారిపోవడంతో బాధితులు న్యాయం కోసం ధర్నాకు దిగారు. దీంతో  పోలీసులే స్వయంగా వచ్చి బాధితులకు నచ్చచెప్పినా వినకుండా ధర్నాను కొనసాగించారు. చివరకు బ్యాంక్ రీజినల్ మేనేజర్ మహివివేక్ బ్యాంక్ దగ్గరకు చేరుకొని బాధితులను సముదాయించే ప్రయత్నం చేశారు.

  KCR | TRS : కేసీఆర్ ప్రధాని కావాలంటూ .. మద్యం,కోళ్లు పంచిన టీఆర్ఎస్‌ నేత ..ఎక్కడో తెలుసా..?

  సర్ది చెప్పిన బ్యాంక్ అధికారులు..

  కస్టమర్లు తాకట్టు పెట్టి ఆర్థిక రుణం తీసుకున్న సమయం నుండి బ్యాంక్ దోపిడీ జరిగిన తేదీ వరకు నగలపై వడ్డీ తీసుకుంటామని గోల్డ్ స్మిత్ వ్యాపారి బ్యాంకులో ధృవీకరించిన ప్రకారం  తాకట్టులో ఉన్న ఒక్క తులం బంగారు ఆభరణానికి ఒక్క గ్రాము చొప్పున తరుగు తీసేసి  మిగతా బంగారం ఇవ్వటానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంస్థ  సిద్దంగా ఉందని చెప్పారు. అయితే  బాధితులు మాత్రం తాము ఎంత బంగారాన్ని తాకట్టు పెట్టామో అంతే బంగారాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పై అధికారులతో మాట్లాడి చెబుతామని సర్ది చెప్పడంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది.

  పోలీసులపైనా డౌట్ ..

  గోల్డ్‌ నగలపై వడ్డీ విషయం, అసలు బంగారంపై బ్యాంక్ అధికారులు భరోసా ఇచ్చినప్పటికి బాధితులు మాత్రం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబరీ జరిగి మూడు నెల‌లు గడుస్తుంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తోందని బాధితులు ప్రశ్నిస్తున్నారు.  పోలీసులు ఇంకా దొంగలను ప‌ట్టుకోక పోవ‌డంతో పోలీస్‌శాఖపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ స్థాయిలో బంగారం, న‌గ‌దు బ్యాంక్ నుచి ఎత్తుకెళ్లిన వారిని ఇప్పటి వరకు గుర్తించలేకపోవటంపై అనేక అనుమానాలు వస్తున్నాయ‌ని బాధితులంటున్నారు. ఈ బ్యాంక్ రాబరీ కేసును సాధ్యమైనంత త్వరగా చేధించి నిందితుల్ని పోలీసులు పట్టుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Bank fraud, Nizamabad, Telangana crime news