హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad news: ప్రైవేట్ హాస్పిటల్‌లో గర్భిణికి నర్సు ఆపరేషన్ .. తర్వాత బిడ్డ పరిస్థితి ఏమైందంటే ..

Sad news: ప్రైవేట్ హాస్పిటల్‌లో గర్భిణికి నర్సు ఆపరేషన్ .. తర్వాత బిడ్డ పరిస్థితి ఏమైందంటే ..

Private hospital

Private hospital

Sad news:పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి ఆసుపత్రిలో ఉంటే డాక్టర్లు వైద్యం చేయడానికి సరైన సమయానికి లేరు. అక్కడే నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ డాక్టర్ అవతారమెత్తింది. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా.

  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

(P.Mahendar,News18,Nizamabad)

కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణం పోసి తల్లి, బిడ్డను సంతోషంగా ఇంటికి పంపుతారని భావించారు. ప్రభుత్వ ఆసుపత్రు(Government Hospital)లపై నమ్మకం లేక ...నిండు గర్భిణిని ప్రైవేటు ఆసుపత్రి(Private hospital)కి తీసుకెళ్లారు. డాక్టర్లు అడిగినంత డబ్బులు పోసి వైద్యం చేయమంటే .. ప్రాణాలతో చెలగాటమాడారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి(Pregnant)ఆసుపత్రిలో ఉంటే డాక్టర్లు (Doctors)వైద్యం చేయడానికి సరైన సమయానికి లేరు. అక్కడే నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ డాక్టర్ అవతారమెత్తింది. కనీసం అవగాహన లేని నర్సు ఆపరేషన్‌ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీయాలని ప్రయత్నించింది. ఇక్కడే సీన్ రివర్సైంది. కళ్లు తెరిచి లోకం చూడాల్సిన పసికందు ప్రాణాలు వదిలింది. ఆందోళనకు దారితీసిన ఈసంఘటన నిమాజాబాద్(Nizamabad)బోధన్(Bodan)పట్టణంలో చోటుచేసుకుంది.

Sad news: కళ్ల ముందే తల్లి చావు .. తలకొరివి పెట్టిన రుణం తీర్చుకున్న పదేళ్ల కూతురు

పురిట్లోనే ఆగిన బిడ్డ ప్రాణం..

ప్రాణాలు పోసే వైద్య వృత్తికి కొందరు డాక్టర్లు కళంకం తెస్తున్నారు. ముఖ్యంగా ప్రసూతి కేసుల విషయంలో తల్లి, బిడ్డల ప్రాణాల్ని కాపాడి సుఖ ప్రసవం చేస్తారని ప్రైవేట్ ఆసుపత్రి మెట్లెక్కుతున్న వాళ్ల నమ్మకంపై నీళ్లు చల్లుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అలాంటి సంఘటనే ఉద్రిక్తతకు దారి తీసింది. మెడిసిన్ చదివి డాక్టర్ డిగ్రీ పొందిన వాళ్లే డెలవరీ చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటిది బోధనల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పట్టణానికి చెందిన ఓ మైనార్టీ మహిళ గర్భం దాల్చడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

కడుపు కోత మిగిల్చారు..

గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సిన సమయంలో బోధన్‌లోని ప్రైవేటు ఆసపుత్రిలో డాక్టర్స్ ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సు డాక్టర్‌ అవతారమెత్తింది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసే క్రమంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా కడుపులో బిడ్డ బయటకు తీసేలోపే చనిపోయింది. ఈవిషయం బాధితురాలు బంధువులకు తెలియడంతో ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు. పురిట్లోనే బిడ్డను కోల్పోయిన ప్రసూతి మహిళకు న్యాయం చేయాలని ఆసుపత్రి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Nizamabad, Pregnant women, Telangana News

ఉత్తమ కథలు