హోమ్ /వార్తలు /telangana /

OMG: మరీ ఇంత కిరాతకమా.. 4 నెలల గర్భవతి అయిన కోడలిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన అత్త

OMG: మరీ ఇంత కిరాతకమా.. 4 నెలల గర్భవతి అయిన కోడలిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన అత్త

బాధితురాలు

బాధితురాలు

కొడ‌లిని (Daughter in law) కూతురుగా చూడాల్సిన అత్త  త‌న పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించింది.. నాలుగు నెల‌ల గ‌ర్బ‌వ‌తి (Pregnant) అని కూడా చూడకుండా దారుణంగా ప్ర‌వ‌ర్తించింది

  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

కొడ‌లిని (Daughter in law) కూతురుగా చూడాల్సిన అత్త  త‌న పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించింది.. నాలుగు నెల‌ల గ‌ర్బ‌వ‌తి (Pregnant) అని కూడా చూడకుండా దారుణంగా ప్ర‌వ‌ర్తించింది. కొడ‌లి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది.  కామారెడ్డి (Kamareddy) జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  అచ్చంపేట గ్రామానికి చెందిన బొడ్డు శంకర్ కుమార్తె కీర్తనను అదే గ్రామానికి చెందిన కురటి పండరితో 2021లో వివాహం చేశారు. పెళ్లైన మొదటి నుంచి కీర్తనకు వేధింపులు మొదలయ్యాయి. నిత్యం  గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.  గొడవల కారణంగా, గ్రామస్తుల సూచనతో కీర్తన భర్తతో కలిసి రాజధాని హైదరాబాద్​కు పనికోసం వలస వెళ్లింది. పొలం పనులు ఉన్నాయని అత్త అంబవ్వ కీర్తనను ఇటీవల ఇంటికి పిలిపించింది. దీంతో భార్యభర్తలు కీర్తన, పండరి అచ్చంపేటకు వచ్చారు.

పండరి పొలం పనులకు వెళ్లగానే పథకం ప్రకారం కోడలు కీర్తనపై అత్త అంబవ్వ పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణానికి ఒడిగట్టింది. తీవ్ర‌గాయాలు అయినా కొడ‌లిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప‌రిస్థితి అందోళ‌న క‌రంగా ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు బాధితురాలు తండ్రి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కురటి అంబవ్వను జుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు నిజాంసాగర్ ఎస్ఐ రాజు తెలిపారు.  అయితే  కీర్తన నాలుగు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో ఆమెకు అబార్షన్ చేసినట్లు వైద్యులు తెలిపారు. కీర్తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

శేరిలింగంపల్లిలో..

కాగా, ఇటీవలె శేరిలింగంపల్లిలో అత్తా కోడళ్ల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది. కోడలిపై తల్లి కోప్పడిందని కొడుకు మందలించడంతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శేరిలింగంపల్లిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గోపన్‌పల్లికి చెందిన యాదమ్మ(48) ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకు రంగస్వామి కొడుకు ఉన్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇళ్లల్లో పనికి ఎవరూ రానివ్వకపోవడంతో కూరగాయలు అమ్ముకునేది.

Youtuber Dheena suicide: హైదరాబాద్​లో దారుణం.. వ్యూస్​ రావడం లేదని యూట్యూబర్​​ ఆత్మహత్య.. వివరాలివే..

అయితే కొడుకు రంగస్వామి కారు వాషింగ్ సెంటరులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే యాదమ్మ గురువారం ఏదో విషయమై కోడలిపై కోప్పడింది. ఈ విషయం తెలిసిన కొడుకు రంగస్వామి తల్లి యాదమ్మను మందలించాడు. అయితే శుక్రవారం ఉదయం యాదమ్మ ఎంతకీ తలుపు తీయలేదు. దీంతో కొడుకు రంగస్వామి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఉరేసుకుని కన్పించింది.

First published:

Tags: Attempt to murder, Kamareddy, OMG, Pregnant women

ఉత్తమ కథలు