Home /News /telangana /

NIZAMABAD ATTEMPTED MURDER OF A SLEEPING WOMAN IN NIZAMABAD DISTRICT SNR NZB

Nizamabad: నిద్రపోతున్న మహిళ నోట్లో గుడ్డలు కుక్కి..కాళ్లు,చేతులు కట్టేసి ఏం చేశారో తెలుసా

(నిద్రపోతున్న మహిళను..)

(నిద్రపోతున్న మహిళను..)

Attempted Murder:అర్ధరాత్రి ఆరుబయట నిద్రపోతున్న ఒంటరి మహిళపై అఘాయిత్యం జరిగింది. ముగ్గురు దుర్మార్గులు నిద్రపోతున్న మహిళ చేతులు, కాళ్లు కట్టేసి..నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లోకి తీసుకెళ్లారు. తర్వాత వాళ్లు చేసిన పని తెలుసుకొని స్థానికులతో పాటు పోలీసులు షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...
(P.Mahendar,News18,Nizamabad)
అర్ధరాత్రి ఆడది నడిరోడ్డుపై నడిచినప్పుడే దేశానికి స్వతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మ గాంధీ చెప్పిన మాట వాస్తవమని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగి సుమారు 75సంవత్సరాలు కావస్తున్న..కామాంధులు, కిరాతకుల నుంచి మాత్రం మహిళలకు విముక్తి కలగడం లేదు. నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో ఓ ఇంటి ఆరుబయట నిద్రపోతున్న మహిళ పట్ల గుర్తు తెలియని వ్యక్తులు కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. నవిపేట(Navipeta)మండలం మహంతo(Mahantham)గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోసాని అనే నడి వయస్సు కలిగిన మహిళ ఇంట్లో ఉక్కబోస్తుందని వరండాలో పడుకున్న పాపానికి ఆ దుర్మార్గులు అంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వెంట్రుకవాసిలో ప్రాణపాయం తప్పిపోయిందని ఊపిరిపీల్చుకోవాలో..మరోసారి ఇదే తరహాలో దాడి చేస్తారని భయపడాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

నిద్రపోతున్నా వదిలిపెట్టరా..
పల్లికొండ పోసాని అనే మహిళ వేసవి కాలం కావ‌డంతో ఇంట్లో ఉక్కపోస్తోందని అరు బయట నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అర్ధరాత్రి సమయంలో పోసాని ఇంటి ముందు నిద్రపోతుంటే ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్కులు, చేతులకు బ్లౌజులు వేసుకుని వచ్చారు. వెంట తెచ్చుకున్న తాళ్లతో మహిళ కాళ్ళు, చేతులు కట్టి నోట్లో బట్టలు కుక్కి ఇంట్లోకి తీసుకు వెళ్లారు. ఇంట్లో గొంతు నిలిమి హ‌త్య చేయ‌డానికి ప్ర‌య‌త్నించించడంతో పెనుగులాట జరిగింది.

(అర్ధరాత్రి మహిళపై..)
(అర్ధరాత్రి మహిళపై..)


ఒంటరి మహిళపై అంతటి అఘాయిత్యమా..
అంతే ఇంట్లోంచి శబ్ధం రావడంతో ఇరుగు, పొరుగు నిద్రలేచి పోసాని ఇంటి వైపుకు రావడంతో దుండగులు గమనించి అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటాహుటిన స్పాట్‌కి చేరుకున్న పోలీసులు మహిళ చేతులు, కాళ్లను కట్టేసిన తాళ్లను తొలగించి చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాఢ నిద్రలో ఉండగా దుండగులు తనపై హత్యాయత్నం చేశారని..మెలకువ వచ్చేలోగా కాళ్లు, చేతులు కట్టి నోట్లో గుడ్లు కుక్కారని బాధితురాలు తెలిపింది.

చేతులు, కాళ్లు కట్టేసి ఏం చేశారంటే..
బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత మహిళ పోసాని స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఒంటరి మహిళపై అర్ధరాత్రి హత్య చేయడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎవరనే విషయాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే పోసానిని హత్య చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Attempt to murder, Nizamabad District

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు