హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : నిజామాబాద్ ఎంపీపై మరోసారి దాడి .. అక్కడికి వెళ్లినా అర్వింద్‌ని వదల్లేదు జనం

Telangana : నిజామాబాద్ ఎంపీపై మరోసారి దాడి .. అక్కడికి వెళ్లినా అర్వింద్‌ని వదల్లేదు జనం

(ఎంపీ అర్వింద్‌పై దాడి)

(ఎంపీ అర్వింద్‌పై దాడి)

Telangana: నిజామాబాద్ ఎంపీపై మరోసారి దాడి జరిగింది. గతంలో పలుమార్లు ఆయన పర్యటనకు అడ్డుపడ్డట్లుగానే శుక్రవారం కూడా జగిత్యాల జిల్లాలోని ఎర్దడ గ్రామానికి వెళ్లిన బీజేపీ ఎంపీపై దాడికి యత్నించారు స్థానికులు. ఈదాడిలో ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అర్వింద్‌ని ఏ మొహం పెట్టుకొని వచ్చారంటూ జనం ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...

(P.Srinivas,New18,Karimnagar)

నిజామాబాద్(Nizamabad)ఎంపీ ధర్మపురి అరవింద్‌(Dharmapuri Arvind)కు మరోసారి చేదుఅనుభవం ఎదురైంది. జగిత్యాల(Jagityala)జిల్లాలోని వరదల్లో చిక్కుకున్న ప్రాంతాలకు వెళ్లిన బీజేపీ ఎంపీ(Bjp mp)పై స్థానికులు చెప్పుల దండ వేసి అవమానించబోయారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపింది. మరోవైపు స్థానికులు ఎంపీపై దాడికి ప్రయత్నించినట్లుగా సమాచారం. అయితే బీజేపీ నేతలు మాత్రం ఎంపీపై దాడి టీఆర్ఎస్‌ వర్గాలు చేసినట్లుగా ఆరోపిస్తున్నారు.

అర్వింద్‌పై జనాగ్రహం ..

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు పదే పదే అవమానాలు ఎదురవుతున్నాయి. గతంలో సంఘటనలు పక్కన పెడితే శుక్రవారం జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాలు గోదావరి వరద ప్రభావంతో మునిగిపోయాయి. ఆ ప్రాంతానికి వెళ్లి వరద బాధితుల్ని పరామర్శించాలనుకున్న ఎంపీ అర్వింద్‌కి స్థానికులు షాక్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామం వర్షం, వరదలతో అస్తవ్యస్థంగా మారింది. స్థానికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే ఎంపీ అర్వింద్ ఎర్దండి గ్రామానికి వెళ్లారు. అర్వింద్‌ గ్రామంలోని రావద్దంటూ స్థానికులు ఆయన కారును అడ్డుకున్నారు. కారుపై దాడి చేయడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎంపీ కాన్వాయ్‌తో పాటు మరో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఇదే సమయంలో కారులో ఉన్న ఎంపీ అర్వింద్ మెడలో చెప్పుల దండ వేయడానికి కొందరు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఆయన సెక్యురిటీ సిబ్బంది వాటిని అఢ్డుకున్నారు.

Hyderabad man Died: అయ్యో.. వార్నింగ్​ బోర్డు సరిచేస్తుంటే గుద్దేసిన కారు.. హైదరాబాద్​ వాసి దుర్మరణం



ఎంపీపై వరుస దాడులు.

గతంలో గ్రామానికి చెందిన కొందరు ఎంపీ అర్వింద్‌ని కలిసి మల్లన్నగుట్ట భూమి విషయంపై పరిష్కారం చూపాలని వేడుకుంటే పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ కోపంతోనే ఇప్పుడు వరద బాధితుల్ని పరామర్శించడానికి వచ్చిన ఎంపీపై దాడికి దిగడమే కాకుండా అప్పుడు న్యాయం చేయని ఎంపీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చారంటూ ప్రశ్నించారు. గ్రామస్తులు ఎంపీని నిలదీసిన సమయంలో ఈదాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఎంపీపై దాడిని అడ్డుకున్న పోలీసులు భారీ భద్రత నడుమ బీజేపీ ఎంపీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించివేశారు. వరదల విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్న తరుణంలో టీఆర్ఎస్‌ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు.


Telangana : ములుగు జిల్లా ప్రజల గుండెల్లో గోదారమ్మ పరుగులు..25గ్రామాలకుపైగా చుట్టుముట్టేసిన వరద

ప్రజల్లో వ్యతిరేకత ..

గతంలో పసుపు బోర్డు విషయంలో ఎంపీ కనబడుట లేదని..హామీ నెరవేర్చలేదంటూ ఆయన్ని ఘోరవ్ చేసిన పరిస్ధితి ఉంది. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు దాడికి పాల్పడ్డారు. రీసెంట్‌గా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కేంద్రం వైఖరిని నిరసిస్తూ నిజామాబాద్‌లోని ఎంపీ ఇంటి ముందు ధాన్యం కుప్పలు పోసి నిరసన తెలిపారు. ఎన్నికలకు మరో ఏడాది సమయం పడుతున్న సమయంలో తెలంగాణలో గెలిచేది బీజేపీనే అని నేతలు చెప్పుకుంటుంటే జిల్లాల్లో గెలిచిన ఒక్క ఎంపీపై ఈ విధంగా దాడి చేయడం చూస్తుంటే ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత ఉందనే విషయం వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

First published:

Tags: Dharmapuri aravind, Jagityala, Nizamabad, Telangana Politics

ఉత్తమ కథలు