Home /News /telangana /

NIZAMABAD ARREST OF BJP LEADERS WHO WENT TO SUPPORT THE STUDENTS AGITATION TO CHANGE THE MESS CONTRACT IN BASARA IIIT COLLEGE SNR ADB

Telangana | Basara iiit : బాసర ట్రిపుల్‌ ఐటీలో టెన్షన్ టెన్షన్ .. తిండి, నిద్ర మానుకొని స్టూడెంట్స్ ఆందోళన

(Basara (iiit )

(Basara (iiit )

Basara iiit: మళ్లీ బాసర ట్రిపుల్‌ ఐటీలో యుద్ధ వాతావరణం నెలకొంది. డిమాండ్లు పరిష్కరించలేదని స్టూడెంట్స్ రాత్రి నుంచి చేస్తున్న ఆందోళన ఉదయానికి మరింత ఉధృతమైంది. మద్దతిచ్చేందుకు వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇంకా చదవండి ...
(K.Lenin,News18,Adilabad)
నిర్మల్ (Nirmal)జిల్లా బాసర(Basara) ట్రిపుల్ ఐటీలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం స్టూడెంట్స్ చేస్తున్న ఉద్యమానికి మద్దతిచ్చేందుకు వెళ్లిన బీజేపీ(BJP) ఎంపీని పోలీసులు(Police) అడ్డుకోవడంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. కాలయాపన చేస్తూ సమస్యల్ని అటకెక్కిస్తున్నారని..మెస్‌ కాంట్రాక్ట్‌(Mess contract)రద్దు చేస్తామని హామీని అమలు చేయలేదని శనివారం(Saturday)రాత్రి నుంచి వేలాది మంది విద్యార్ధులు తిండి, తిప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి మరీ పోరాడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రిపుల్‌ ఐటీలో థర్డ్‌ వరల్డ్ వార్‌ స్థాయిలో పోరాటం జరుగుతోంది. సుమారు పది రోజులు క్యాంపస్ ముందు ధర్నా చేపట్టిన స్టూడెంట్స్ ఆతర్వాత డెడ్‌లైన్ విధించినప్పటికి దిగి రాకపోవడంతో ఇప్పుడు ఏకంగా నైట్ భోజనం మానేసి మరీ పోరాడుతున్నారు.

Marital murder : కొంప ముంచిన భర్త అనుమానం.. భార్యను ఏం చేశాడో తెలుసా ..?



రగులుతున్న ట్రిపుల్‌ ఐటీ..
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిపుల్ ఐటీ (RGUKT IIIT)కాలేజీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన జరిగి 15 రోజులు దాటినా.. మెస్‌ కాంట్రాక్టర్లను మార్చలేదని, ఆరోజు తమకు అధికారులిచ్చిన హామీలు నెరవేర్చలేదని బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. మెస్‌లలో ఖాళీ బెంచీలపై కూర్చుని డిన్నర్‌ బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆందోళనలో ట్రిపుల్ ఐటీ E1,E2 కు చెందిన మూడువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈనెల 15వ తేదిన ఫుడ్ పాయిజన్ అయితే నాణ్యత లేని మెస్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఈనెల 24వ తేది నాటికి డిమాండ్లు పరిష్కరించాలని డెడ్‌ లైన్ విధించారు. ఇవేమి పరిష్కరించకపోవడంతో మళ్లీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.



నివురుగప్పిన నిప్పులా ..
ట్రిపుల్‌ ఐటీ స్టూడెంట్స్‌ ఆందోళనపై స్పందించిన అధికారులు రాత్రి 10 గంటల తర్వాత మెస్‌ కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలుస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీలోని 8,684 మంది విద్యార్థులకు భోజనాలు, టిఫిన్స్‌ అందించేందుకు ఆగస్టు 6లోపు టెండర్లు దాఖలు చేయాలని డైరెక్టర్‌ సతీశ్‌ పేరిట ఆ టెండర్‌లో పేర్కొన్నారు. అయితే విద్యార్థులు మాత్రం రాత్రి 11 గంటల వరకు భోజనం చేయలేదు. రాత్రి మూడు గంటల తర్వాత మెస్‌ల నుంచి హాస్టల్‌లోకి వెళ్లి పడుకున్నారు.

Mulugu: వాళ్లు జల్సా రాయుళ్లు .. కేవలం వాటిని మాత్రమే మాయం చేస్తారు



టెన్షన్ ..టెన్షన్..
బాసర ట్రిపుల్‌ ఐటీలో స్టూడెంట్స్ ఆందోళన ఇంత ఉధృతంగా మారడంతో బీజేపీ నేతలు ట్రిపుల్ ఐటీ కాలేజీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఉదయం క్యాంపస్‌కి వెళ్లి ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్‌ని పరామర్శించాలని వెళ్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపురావును లోకేశ్వరం మండల్ మన్మద్ వద్ద అరెస్టు చేశారు. పోలీసు వాహనాన్ని వెళ్లకుండా అడ్డుకున్న బిజెవైఎం నాయకులు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు వెంకటేష్ కాలిపై పై నుండి వెళ్లిన పోలీసుల వాహనం, కాలికి స్వల్ప గాయాలయ్యాయి. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అర్జున్ చేతికి గాయమవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Basara IIIT, Nirmal district, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు