Road Accident: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఏసీపీకి తీవ్ర గాయాలు

Khammam Road Accident: రాత్రివేళ రోడ్డు ప్రమాదంలో... ఏపీసీ బాలూజాదవ్‌కి గాయాలవడం కలకలం రేపింది. అసలీ ప్రమాదం ఎలా జరిగిందని చాలా మంది ఆరా తీస్తున్నారు.

news18-telugu
Updated: August 29, 2020, 5:59 AM IST
Road Accident: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఏసీపీకి తీవ్ర గాయాలు
Road Accident: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఏసీపీకి తీవ్ర గాయాలు (symbolic image)
  • Share this:
Khammam Road Accident: ఖమ్మం జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్‌ యాంటీ నక్సల్‌ బ్యూరో ACP, కన్‌ఫర్డ్‌ IPS ఆఫీసర్ బాలూజాదవ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కూసుమంచి మండలం జీళ్లచెరువు దగ్గర శుక్రవారం రాత్రి బాలూజాదవ్ కారులో వెళ్తున్నప్పుడు ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. జీళ్లచెరువు శివార్లలోకి కారు రాగానే... ఎదురుగా ఓ వాహనం రావడాన్ని కారు డ్రైవర్ చూశారు. అరే ఇప్పుడెలా అనుకుంటూ... ఆయన బండిని వేగంగా పక్కకు మళ్లించారు. అదే సమయంలో... కారు వేగంగా... పక్కకు జరిగి... ఏకంగా రోడ్డు పక్కకు వెళ్లింది. అక్కడో పెద్ద గొయ్యి లాంటిది ఉంది. ఆ గొయ్యిలోకి కారు పడటంతో... కంట్రోల్ తప్పింది. అలా వంకరగా దూసుకుపోయి... ఓ చెట్టును ఢీకొట్టింది. ధబ్ మని పెద్ద శబ్దం వపచ్చింది. డ్రైవర్‌ సీటు బెల్ట్‌ పెట్టుకోవడం, ఎయిర్‌ బెలూన్‌ తెరచుకోవడంతో చిన్న గాయాలతో బయటపడ్డారు. బాలూజాదవ్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న బాలూజాదవ్‌ సోదరుడు సేట్‌రామ్‌ నాయక్‌ వెంటనే అక్కడకు వెళ్లి... ఇద్దర్నీ ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలూజాదవ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలూజాదవ్‌ నిజామాబాద్‌లో డ్యూటీ ముగించుకుని కారులో హైదరాబాద్‌ వెళ్లి, అక్కడి నుంచి ఖమ్మం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలూజాదవ్‌ సొంతూరు కూసుమంచి మండలం లోక్యాతండా. ఆయన ఖమ్మంలో ఉంటున్నారు. ఈమధ్య వానలు బాగా పడటంతో... రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్డు పక్కన గుంతలు ఎక్కువయ్యాయి. ఏమాత్రం వాహనాలు కాస్త వేగంగా వెళ్లినా... ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి.
Published by: Krishna Kumar N
First published: August 29, 2020, 5:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading