Home /News /telangana /

NIZAMABAD AN ELDERLY COUPLE IN KAMAREDDY COMMITTED SUICIDE AS THEY DID NOT WANT TO SERVE ANYONE DUE TO POOR HEALTH NZB PRV

Kamareddy: అయ్యో.. వయసు మీద పడిందని ఆ వృద్ధ దంపతులు ఎంత పని చేశారో తెలుసా?

మృతులు (ఫైల్​)

మృతులు (ఫైల్​)

ఓ వృద్ద భార్య, భ‌ర్త‌లు ఏవ‌రికి భారం కాకూడదు అనుకున్నారు. ఎవ‌రి తో సేవ చేయించుకోవాల‌నుకోలేదు.. వారి ప‌నులు వారు చేసుకోవ‌డం భారం అవుతుండ‌టంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు.

    మ‌నిషి మ‌నుగ‌డ సాగించాలంటే త‌న ఆరోగ్యం (Health) కూడా స‌హక‌రించాలి.. అప్పుడే మ‌నిషి మ‌నుగ‌డ సాధ్యమవుతుంది.. అయితే ఓ వృద్ద భార్య,  భ‌ర్త‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ (health issues) తో జీవితాన్ని త్యజించారు (Suicide).. ఏవ‌రికి భారం కాకూడదు అనుకున్నారు. ఎవ‌రి తో సేవ చేయించుకోవాల‌నుకోలేదు (hey did not want to serve anyone).. వారి ప‌నులు వారు చేసుకోవ‌డం భారం అవుతుండ‌టం తో ఇద్ద‌రు వృద్ద దంప‌తులు (elderly couple) త‌నువు చాలించారు.. ఈ ఘ‌ట‌న కామారెడ్డి (Kamareddy)జిల్లా లో చోటు చేసుకుంది. పోలీసులు (Police) తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆరోగొండ ఒడ్డెవ్వ (60) , లింబ‌య్య (65) ఇద్ద‌రు వృద్ద దంప‌తులు.. వీరికి ఇద్ద‌రు కొడుకులు. అయితే పెద్ద  కొడుకు చ‌నిపోయాడు. గ‌త‌ ఏడాది నుంచి ఆరుగొండ ఒడ్డెవ్వ‌  (Aarugonda Oddevva)కు కంటి చూపు మందగించింది.

    ఎవ‌రు లేని స‌మ‌యంలో..

    ఒడ్డెవ్వ‌ కు భర్త లింబ‌య్య‌ (Limbayya), కొడుకు లింబాద్రి (Limbadri)సేవలు చేసే వారు.. అయితే  ఒడ్డెవ్వ భ‌ర్త లింబ‌య్య‌ కు మోకాళ్ల నొప్పులు మొద‌ల‌య్యాయి. దీంతో లింబ‌య్య కూడా మంచానికి ప‌రిమిత మ‌య్యాడు.. ఇద్ద‌రి కి సేవ చేయించుకొవ‌డం ఇష్టం లేక జీవితాన్ని ముగించాల‌ని ఆ వృద్ద దంప‌తులు అనుకున్నారు. అయితే ఎవ‌రు లేని స‌మ‌యంలో ఇద్ద‌రి క‌లిసి ఉరి వేసుకుని (hanging) బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు (Attempt to suicide). ఉద‌యం లేచి చూడ‌గా ఇద్ద‌రు ఉరి వేసుకుని క‌నిపించడంతో కొడుకు లింబాద్రి క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.



    ఇబ్బంది పెడుతున్నామ‌ని..

    విష‌యం తెలిసిన పోలీసులు (Police) సంఘ‌ట‌న స్థలానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  అమ్మ నాన్న‌లు గ‌త కొంత కాలంగా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌  (health issues) తో బాధప‌డుతున్నారని లింబాద్రి అన్నాడు. అమ్మ‌కు కళ్లు క‌నిపించడం లేదని, నాన్న లింబ‌య్య కు మోకాళ్ల నొప్పులు రావ‌డంతో న‌డవ‌డం క‌ష్టంగా మారిందని తెలిపాడు. దీంతో రోజు బాధప‌డేవారని, మా  ఆరోగ్యం బాగా లేక నీకు ఇబ్బంది  (Trouble)పెడుతున్నామ‌ని ఎప్పుడు అనేవార‌ని కొడుకు లింబాద్రి వాపోయాడు. మృతుల కొడుకు లింబాద్రి ఫిర్యాదు మేర‌కు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భువనేశ్వరరావు (SI Bhuvaneswar) తెలిపారు. చివ‌రి రోజుల్లో ఇలా తమతో ఎప్పుడూ మాట్లాడే వృద్ద దంప‌తులు ఆత్మ హ‌త్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి. ఎంతో జీవితాన్ని చూసిన వీరు.. ఈ చిన్న క‌ష్టానికి ఎదురు నిలువ లేక పోయారని  స్తానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Attemp to suicide, Kamareddy, Old man, Old women, Suicide

    తదుపరి వార్తలు