కష్టపడితే ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఇష్టపడి చదివితే అవకాశాలు వాటంతట అవే దరికి చేరుతాయి. తెలంగాణ(Telangana)లోని నిర్మల్ జిల్లాకు చెందిన బాసర(Basara)ట్రిపుల్ ఐటీ (iiit)స్టూడెంట్ సాధించిన విజయమే ఇందుకు ఉదాహరణ. చదువుకునే సమయంలో కెరియర్(Career)గురించి పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడంతో మంచి ఉద్యోగం సంపాధించాడు. యూనివర్సిటీలోనేనే స్టూడెంట్స్‌ని సక్సెస్ వరిస్తుంది. నిఖిల్ కుమార్(Nikhil Kumar)అనే కంప్యూటర్ సైన్స్ (Computer Science)చదువుతున్న విద్యార్ధి జాబ్(JOB)రూపంలో జాక్‌పాట్ కొట్టాడు.
BASARA IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళనలకు తాత్కాలికంగా తెర .. ఒక్క రోజులో జరిగిన సిస్ట్యూవేషన్
జాబ్ రూపంలో జాక్ పాట్..
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న స్టూడెంట్ అద్బుతమైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. నిఖిల్ తంగళ్లపల్లి అనే విద్యార్ధి మల్టీ నేషనల్ కంపెనీగా పేరు గడించిన అమెజాన్‌లో 65లక్షల జీతంతో కూడిన ఉద్యోగాన్ని సంపాధించాడు. స్టూడెంట్ సాధించిన విజయానికి గర్విస్తూ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వెంకటరమణ, సంచాలకులు ఆచార్య సతీష్ కుమార్ విద్యార్ధిని అభినందించారు. విశ్వవిద్యాలయంలోని విద్యార్ధినీ విద్యార్ధులు తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుతున్న వనరులను ఉపయోగించుకొని జీవితంలో ఉన్నతస్థానంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్‌కి భారీ జీతం..
ఇటీవలే నిఖిల్ కంప్యూటర్సైన్స్లో డిగ్రీ పూర్తి చేశాడు నిఖిల్. బాసర ట్రిపుల్ ఐటీ చరిత్రలోనే అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాధించిన తొలి విద్యార్ధిగా నిఖిల్ తంగళ్లపల్లి రికార్డ్ సృష్టించాడు. ఈసందర్భంగా ఆర్జీయూకేటీ ఇన్చార్జీ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ అభినందించారు. శాలువాతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్న వనరులను ఉపయోగించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా వారు స్టూడెంట్స్‌కు సూచించారు ఇన్‌చార్జ్ వీసీ.
రికార్డ్ బ్రేక్ చేసిని నిఖిల్..
ప్రజెంట్ జనరేషన్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలన్న పట్టుదలతో పాటు సెల్ఫ్ గోల్ పెట్టుకొని చదువుకునే విద్యార్ధులకు ఇటువంటి ఉద్యోగ అకాశాలు, అత్యధిక వేతనాలు వరిస్తాయని వీసీ తెలిపారు. ట్రిపుల్ ఐటీలో ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా మంది దక్కించుకోవాలని ఆకాంక్షించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Basara IIIT, Telangana News