నిజామాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి, పి మహేందర్
వందల ఏళ్ల చరిత్రకు ప్రతీకలు. విశిష్టమైన శిల్పాలు. అరుదైన నాణేలు. అలనాటి ఆయుధాలు. పురాతన గ్రంథాలు. సంస్మృతిని ప్రతిబింబించే శాసనాలు. నైజం కాలంలో వాడిన వస్తువులు. ఇందూరు చరిత్ర ఇలా ఒక్కటేమిటి వందల సంఖ్యలో అపురూప వస్తువులతో నిండి ఉన్న పురావస్తు ప్రదర్శనశాల గత ఏడేళ్లుగా మూతబడి ఉంది. దీంతో భావితరాలకు చరిత్రకు సంబంధించిన వస్తూలు. నాణేలు, గ్రంథాలుచూసే ఆవకాశం లేకుండా పోయింది. దీంతో అధికారులు, ప్రజాప్రతి నిధులు చొరవ తీసుకుని పురావస్తు ప్రదర్శనశాలను తెరిపించాలనే డిమాండ్ పెగుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ లో ఉన్న పురావస్తు ప్రదర్శనశాల ఉంది. ఇందులో ఇందురు చరిత్రకు సంబంధించిన వస్తువులు. నాణేలు, నైజం కాలంలో వాడిన వస్తులు, పరికరాలు, గ్రంథాలు ఇలా ఎన్నో విషయాలకు సంబంధించి ఆదారులు ఈ మ్యూజియంలో ఉన్నాయి.
అయితే గతంలో స్కూల్ విద్యార్థులను తీసుకువచ్చి చూపించే వారు. దీంతో విద్యార్థులు తెలియని విషయాలు తెలుసుకునే వారు. నగర నడి బోడ్డున ఉండడంతో ఎప్పుడు జనలతో నిండి ఉండేది. అయితే గత 2015 నుంచి ఈ మ్యూజియం ముసుగు వేసింది. భవనం శిథిలావస్థకు చేరిందంటూ మ్యూజియంను ఏడేళ్లలుగా మూసేశారు. నాటి నుండి నేటి వరకు అపురూప శిల్పాలు, అరుదైన శాసనాలను తిలకించే అవకాశం లేకుండా చేశారు. మ్యూజియం పాత్రను ప్రోత్సహించడానికి 1977 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మ్యూజియం యొక్క అవగాహన అందులోని వస్తువులను, చరిత్రను ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు తెలియ జేసేందుకు మ్యూజియం డేను నిర్వహిస్తున్నారు. అయితే పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏడేళ్లుగా మ్యూజియంను సందర్శించి అవకాశం జిల్లాకు చెందిన విద్యార్థులు, ప్రజలకు దక్కడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
వందల యేళ్ల చరిత్ర కలిగిన వస్తువులు చూసేందుకు వీలు లేకుండా మ్యూజియంను మూసివేయడం బాధాకరం అని విద్యావంతుల వేదిక, ఆడ్వకేట్ ఆశ నారాయణ అంటున్నారు. పురావస్తు నాణేలు, గ్రంథాలు, ఇందురు చరిత్ర నైజం పాలనలో పోరాలకు సంబంధించి వస్తువులు కరునుమరుగవుతున్నాయి. దీంతో బావితరాలకు మన చరిత్రను చూపించే ఆవసరం ఎంతైనా ఉంది అన్నారు. ఏడేళ్లుగా మ్యూజియం మూసి ఉంచడంతో ఆందులో ఉన్న వస్తులు అన్ని తుప్పు పట్టే ఆవకాశం ఉంది. వేంటే ప్రభుత్వం స్పందించి ఈ మ్యూజియం తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మ్యుజియం లో భవనం ఉంది కూడా దానిని మరవత్తులు చేయకుండా మూతవేయండం బాధాకరం అని పిడియాఎస్ యూ నాయకులు సుదాకర్ అంటున్నారు. అందులో వస్తూలు కూడా తుప్పు పట్టి పోతున్నాయిని ఆవేదన వ్యక్తం చేసారు. యేడేళ్లుగా మూత వేయడంతో విద్యార్ధులు, జిల్లా ప్రజలు మ్యూజియం సందర్శనకు నోచుకోలేకపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.