హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad news: ఎవ‌రో చేసిన త‌ప్పుకు మ‌రో విద్యార్థిని బాలి చేసిన టీచ‌ర్లు .. ఉపాధ్యాయుల కర్కశానికి స్టూడెంట్ కర్ణభేరి డ్యామేజ్

Sad news: ఎవ‌రో చేసిన త‌ప్పుకు మ‌రో విద్యార్థిని బాలి చేసిన టీచ‌ర్లు .. ఉపాధ్యాయుల కర్కశానికి స్టూడెంట్ కర్ణభేరి డ్యామేజ్

TEACHERS BEATING

TEACHERS BEATING

Telangana: పాఠ‌శాల‌లో బిగించిన సీసీ కెమెరాల‌ను తోటి విద్యార్థులు తాకుతుంటే వ‌ద్ద‌ని చెప్పిన విద్యార్థిని  ఉపాధ్యాయులు చిత‌క బాదారు. విష‌యం చెప్పిన ప‌ట్టించుకోకుడా విచ‌క్ష‌ణ ర‌హితంగా కొట్టారు. దీంతో విద్యార్థి చెవి దగ్గర గ‌ట్టిగా కొట్ట‌డంతో క‌ర్ణ‌బేరి డ్యామేజ్ అయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P.Mahendar,News18,Nizamabad)

  పాఠ‌శాల‌లో బిగించిన సీసీ కెమెరా(CC camera)ల‌ను తోటి విద్యార్థులు తాకుతుంటే వ‌ద్ద‌ని చెప్పిన విద్యార్థిని  ఉపాధ్యాయులు చిత‌క బాదారు. విష‌యం చెప్పిన ప‌ట్టించుకోకుడా విచ‌క్ష‌ణ ర‌హితంగా కొట్టారు. దీంతో విద్యార్థి చెవి దగ్గర గ‌ట్టిగా కొట్ట‌డంతో క‌ర్ణ‌బేరి డ్యామేజ్ (Ear damage)అయింది. దీంతో  విద్యార్థి తల్లిదండ్రులు పాఠ‌శాల‌కు వ‌చ్చి ఆందోళన చేపట్టారు. నిజామాబాద్(Nizamabad)జిల్లాలో జరిగిన ఈసంఘటనపై ఉపాధ్యాయుడి ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెనుక ముందు చూడకుండా టీచర్లు(Teachers)ఇంత దాష్టీకంగా ప్రవర్తించడం ఏమిటని మండిపడుతున్నారు.

  Secunderabad Fire Accident : సికింద్రాబాద్‌ ఫైర్ యాక్సిడెంట్‌ మృతుల కుటుంబాలకు ప్రధాని రెండు లక్షలు, కేటీఆర్‌ మూడు లక్షలు పరిహారం ప్రకటన

  స్టూడెంట్‌పై టీచర్ల దాడి..

  నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూత్పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల‌ పాఠశాలలో జీజీ నడుకుడా గ్రామానికి చెందిన రుషేంద్ర  10వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పాఠశాలలో ఆడుకుంటూ సీసీ కెమెరాని ముట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న వ్యాయమ ఉపాధ్యాయుడు శ్రీకాంత్, ఉపాధ్యాయులు శంకర్, న‌రేష్, రుషేంద్ర అనే విద్యార్థిని గదిలోకి తీసుకెళ్లి విచక్షణా రహితంగాకొట్టారు. దెబ్బలకు తాళ లేక రుషేంద్ర అస్వస్థతకు గురయ్యాడు.

  అకారణంగా కొట్టడంపై ఆగ్రహం..

  విద్యార్ధి అస్వస్థతకు గురైన విషయాన్ని మరుసటిరోజు తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యార్ధిని గురుకుల పాఠ‌శాల‌ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. డాక్టర్లు స్టూడెంట్ రూషేంద్ర చెవి కర్ణభేరి దెబ్బతిన్నదని.. వినికిడిపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ‌స‌భ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్‌పై ఇంతటి కర్కశంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు, డ్రిల్‌ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని డమాండ్ చేస్తూ పాఠశాలలో ఆందోళనకు దిగారు విద్యార్ధి బంధువులు. స్టూడెంట్ పేరెంట్స్ ఆందోళనతో హాస్టల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  చెట్లనే అమ్మతల్లిగా కొలిచే గిరిజనులు.. అవతార్ లాంటి సాంప్రదాయం.. ఎక్కడో తెలుసా..!

  ముగ్గురు టీచర్లపై వేటు ..

  తాను ఏ త‌ప్పు చేయ‌లేదని విద్యార్థి రుషేంద్ర తెలిపాడు. సీసీ కెమెరాను ముట్టుకుంటే వద్దని చెప్పానని..అయితే ఎవరో ప్లాస్టర్ వేస్తే తనను పిలిపించిన ముగ్గురు టీచర్లు చితకబాదారని వాపోయాడు. తాను అసలు సీసీ కెమెరాను ముట్టుకోలేదని..అదే విషయాన్ని చెబుతున్నా టీచర్లు పట్టించుకోకుండా మెడపై, చెవుపై కొట్టారని స్టూడెంట్ రుషేంద్ర ఆవేదన వ్యక్తం చేసాడు. ఈఘటనపై సమాచారం అందుకున్న గురుకుల ఆర్ సీవో సత్యనాథ్ రెడ్డి పాఠశాలకు చేరుకొని విచారించారు. ఉపాధ్యాయుడు శ్రీకాంత్, గణితం ఉపాధ్యాయుడు శంకర్‌ను విధుల నుంచి తొలగించామని, మరో ఉపాధ్యా యుడైన నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నతా ధికారులకు నివేదిక పంపినట్లుగా తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో స్టూడెంట్స్ బంధువులు ఆందోళన విరమించారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Nizamabad, Teachers, Telangana News

  ఉత్తమ కథలు