బార్ (Bar) లోకి వచ్చిన వ్యక్తి ఒక్క సారిగా గన్ (Gun)తో హల్చల్ చేశాడు. దీంతో అక్కడ మద్యం సేవిస్తున్న మందు బాబులు ఒక్కసారిగా భయభ్రాంతుల కు గురై పారిపోయారు. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బార్ సిబ్బందిని బెదిరించి నానా హంగామా సృష్టించాడు ఆ వ్యక్తి. కాల్చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా భయంతో పరుగుతీశారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) స్పాట్‌కు చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఏ - వన్ బార్..
కామారెడ్డి (kamareddy) జిల్లాలో గన్ కల్చర్ పెరుగుతుంది. గత నెల క్రితం ఓ దాబా వద్ద భోజనం చేయడానికి వెళుతున్న నలుగురు యువకులను బెదిరించిన సంఘటన మరువక ముందే తాజాగా నిన్న రాత్రి ఓ వ్యక్తి తుపాకీతో (Gun) బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా గల ఏ - వన్ బార్ (A1 Bar) లో బుధవారం రాత్రి 11 గంటలకు అజంపూర కాలనీకి చెందిన రఫీక్ మద్యం సేవించేందుకు వచ్చాడు.
బార్ సిబ్బందిని కాల్చేస్తానని..
మద్యం (Alcohol) తాగిన తరువాత తన వద్ద ఉన్న గన్ (Gun)ను బయటకు తీసీ బార్ సిబ్బందిని బెదిరించాడు. అయితే ఆ దృశ్యాలను చూసిన మందు బాబులు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. భయభ్రాంతులకు గురై పారి పోయారు (Run away). బార్ సిబ్బందిని కాల్చేస్తానని ఆ వ్యక్తి బెదిరించాడు.. దీంతో స్థానికులు కామారెడ్డి పట్టణ పోలీసు లకు (kamareddy City police) సమాచారం అందిచారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గన్ కలిగి ఉన్న రఫీక్ ను అదుపులో కి తీసుకొన్నారు. అతణ్ని అక్కడి నుంచి కామారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఒక్కసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
జిల్లాలో ఇది మూడో సారి..
గన్ కల్చర్ (Gun culture) కామారెడ్డి లో పెరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. యువకుడు ఉపయోగించిన గన్.. ఎయిర్ గన్ గా పోలీసులు గుర్తించారు. ఈ గన్ కల్చర్ చూసి కామారెడ్డి జిల్లా లో ఎక్కువగా కనిపిస్తుంది.. జిల్లాలో ఇది మూడో సారి గన్ తో బెదిరించడం.. అయితే ఈ గన్స్ ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నారు.. ఏలా రవాణ చేస్తున్నారు అనే విషయాలపై ఆరాతీయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజల్లో భయం పారద్రోలాల్సిన ఆవశ్యకత పోలీసులపై ఎంతైనా ఉంది. ఆ దిశగా పోసులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Gun fire, Kamareddy