హోమ్ /వార్తలు /తెలంగాణ /

పెళ్లైన 2 నెలలకే ఆ ఇంట విషాదం..అసలేం జరిగిందంటే?

పెళ్లైన 2 నెలలకే ఆ ఇంట విషాదం..అసలేం జరిగిందంటే?

నేనేమి చేశాను నేరం?

నేనేమి చేశాను నేరం?

ఎన్నో క‌ల‌ల‌తో కొత్త జీవితాన్ని ఆరంభించారు. ముచ్చ‌ట‌గా రెండు నెల‌ల క్రితం పెద్ద స‌మ‌క్షంలో వివాహం చేసుకున్నారు. వారి బంగారు భ‌విష‌త్తు కోసం బాట‌లు వేసుకున్నారు. కానీ ప్ర‌మాద‌వశాత్తు ఐదు ఆంత‌స్తుల నుంచి జారిప‌డి న‌వ వ‌దువు మృతి చెందిన ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

P.Mahendar,News18,Nizamabad

ఎన్నో క‌ల‌ల‌తో కొత్త జీవితాన్ని ఆరంభించారు. ముచ్చ‌ట‌గా రెండు నెల‌ల క్రితం పెద్ద స‌మ‌క్షంలో వివాహం చేసుకున్నారు. వారి బంగారు భ‌విష‌త్తు కోసం బాట‌లు వేసుకున్నారు. కానీ ప్ర‌మాద‌వశాత్తు ఐదు ఆంత‌స్తుల నుంచి జారిప‌డి న‌వ వ‌దువు మృతి చెందిన ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Telangana: గవర్నర్‌కు ఎవరూ బానిసలు లేరు.. తెలంగాణ మంత్రి కౌంటర్

నిజామాబాద్ న‌గ‌రంలోని హమాల్వాడికి చెందిన కూన రమేశ్ కు ముగ్గురు కూతుళ్లు..  చిన్న కూతురు పూర్ణిమ (26) ను నగరానికి చెందిన విశాల్ కు ఇచ్చి పెళ్లి చేసారు. అయితే చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వీరు ఒకరినొకరు ఇష్ట పడి పెద్దల సమక్షంలో 2022 డిసెంబరు 18న వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారని, వీరి మధ్య ఎలాంటి తగాదాలు లేవని కుటుంబీకులు తెలిపారు. పూర్ణిమ టీసీఎస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండ‌గా..భర్త విశాల్ నిజామాబాద్ లో కన్స్ ట్ర‌క్ష‌న్ బిల్డర్ గా స్థిరపడ్డారు.  అయితే ఈ జంట సుభాష్ న‌గర్ లోని ఓ అపార్టుమెంట్ అయిదో అంతస్తులోని ఫ్లాట్ లో అద్దెకు ఉంటున్నారు.

Hyderabad: కులాంతర వివాహం చేసుకున్నాడని.. యువకుడిని నరికి చంపారు..!

గురువారం ఉదయం 11 గంటల సమయంలో అల్పాహారం కోసం వంట పాత్రలు అవసరం ఉండగా పూర్ణిమ బాల్కనీకి వెళ్లారు. దీంతో అక్కడి నుంచి జారి కిందపడ్డారు. ప్రమాదంలో బలమైన గాయాలై ఘటనా స్థలంలోనే పూర్ణిమ ప్రాణాలు కోల్పోయింది.  స్థానికులు, పోలీసులు మొదట ఆత్మహత్యగా భావించారు. విచారణ అనంతరం ప్రమాదవశాత్తు జారి పడినట్లు తేలింది. మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్నోఆశ‌ల‌తో కొత్త జీవితాన్ని మొద‌లు పెట్టిన జంట‌ను ఆ భ‌గ‌వంతుడు చిన్న చూపు చూసాడు. దీంతో వారి క‌ల‌లు..వారిని క‌న్న వారి క‌ల‌లు క‌ల్ల‌లు అయ్యాయి. ఎంతో సాఫీగా సాగిపోతున్న వారి సంసార జీవితం ఒక‌రు కాటికి పోగా..మ‌రోక‌రు బ్ర‌తికి ఉండి న‌ర‌కం అనుభ‌విస్తున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి.

First published:

Tags: Nizamabad, Telangana