తల్లి అంటే బిడ్డలను తన కడుపున పెట్టుకుని పెంచి పెద్ద చేస్తుంది. తాను తినకున్నా బిడ్డలకు పెట్టి వారికి భవిషత్తును నిర్మిస్తుంది. అయితే ఓ కసాయి తల్లి తన కడుపున మోసి కని..పెంచి పెద్ద చేసిన ఆరేళ్ల బాబును తన సుఖానికి అడ్డుగా ఉన్నాడని నీటి కాలువలో ముంచి హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లికి చెందిన లావణ్యకు నిజామాబాద్ నగరంలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన భరత్ కి 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
భర్త భరత్ మేస్ట్రీ పని చేస్తూ గతంలో ఇందల్వాయి, కామారెడ్డిలో పని చేశాడు. అయితే రెండేళ్లుగా నగరంలోని సంతోష్ నగర్ కాలనీలో భరత్, లావణ్య దంపతులు వారి కొడుకుతో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో లావణ్య మద్యానికి బానిసగా మారింది. తన జల్సాలకు డబ్బులు అవసరమై వ్యభిచార వృత్తిని ఎంచుకుంది. అయితే తన పడక సుఖానికి ఆరేళ్ల కొడుకు రోహిత్ అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో కొడుకును నగర శివారులోని మాణిక్ బండారు గ్రామ శివారులోని కెనాల్ వద్దకు తీసుకెళ్ళింది. మద్యం మత్తులో ఉన్న లావణ్య కొడుకు గొంతు నులిమి..హత మార్చి కెనాల్ లో పడేసింది. స్థానికులు చూసి మాక్లూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న నార్త్ సిఐ నరహరి, మాక్లూర్ ఎస్ఐ యాదగిరి గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కొడుకును హత్య చేసిన లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. ఏడాది క్రితం తన పెద్ద కొడుకు కన్నయ్యను లావణ్య ఇదే తరహాలో హత్య చేసిందని కుటుంబసభ్యులు తెలిపారు. తన జల్సాల కోసం అభం శుభం తెలియని ఇద్దరు కుమారులను హతమార్చి దారుణానికి ఒడిగట్టింది. భర్త భరత్ ఫిర్యాదు మేరకు మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈనెల 28న భర్త గడ్డం భరత్ పై తన భార్య లావణ్య కత్తితో దాడి చేసి గాయపరిచిందని..నిన్న సాయంత్రం ఇంటి నుండి బయలుదేరిన లావణ్య తన చిన్న కుమారుడు గడ్డం రోహిత్ తో ఇంటి నుండి వెళ్లిందని భరత్ చెబుతున్నాడని పోలీసులు తెలిపారు.
ఈ రోజు ఉదయం దాస్ నగర్ సమీపంలో సుమారు 6 గంటలకు రోహిత్ ను కెనాల్ నీటిలో ముంచి చంపినట్టు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. కొడుకును చంపిన నిందితురాలిని కఠినంగా శిక్షించాలని కుటుంబీకులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.