NIZAMABAD A MAN NAMED SATYANARAYANA SELLS CHILLI BAJJI FOR JUST ONE RUPEE IN KAMAREDDY DESPITE THE EVER INCREASING PRICES NZB PRV
One Rupee mirchi: ఆయన బండి దగ్గర రూపాయికే మిర్చి బజ్జీ.. నిత్యావసరాల ధరలు మండిపోతున్నాపెంచని పెద్దాయన
మిర్చీలు
నిత్యవసర ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి.. ఏది కొనాలన్నా సామాన్యుడి వల్ల కావడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ ఊళ్లో ఒక్క రూపాయికే మిర్చి.. ఒక్క రూపాయికి బజ్జీ అమ్ముతున్నారు.
నిత్యవసర ధరలన్నీ (increasing prices) ఆకాశాన్నంటుతున్నాయి.. ఏది కొనాలన్నా సామాన్యుడి వల్ల కావడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ ఊళ్లో ఒక్క రూపాయికే మిర్చి.. ఒక్క రూపాయికి బజ్జీ (chilli bajji) అమ్ముతున్నారు. యాభై యేళ్లుగా నిరాటంకంగా వాళ్ల వ్యాపారం సాగుతోంది. ఏడు పదుల వయసులోనూ మిర్చి బజ్జీ దందాలో కొనసాగుతున్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఆముద సత్యనారాయణ (Amudha Sathyanarayana)ఊర్మిల దంపతులు యాభై యేళ్ల కిందట మిర్చి బజ్జీ (Mirchi)ల అమ్మకాలు మొదలుపెట్టారు. అప్పట్లో గ్రామాల్లో వారం వారం సంతల్లో .. ఊర్లలో జరిగే జాతరల్లో.. ఉత్సవాల్లో వేడివేడి మీర్చి.. బజ్జీలు తయారు చేస్తూ అమ్ముతుండేవారు. మిగతా రోజుల్లో రాజంపేటలోని ప్రధాన కూడలి వద్ద బండిపై అమ్ముతుంటారు. అయితే వయస్సు పైబడటంతో బయటకు వెళ్లడం మానేశారు. ఇంటి దగ్గరే పొయ్యి మీద మిర్చీలు గోలించి బండిపై పెట్టుకుని అమ్ముతున్నారు.
మొదట ఒక్క రూపాయికి 16 మిర్చి బజ్జీలు ఇచ్చేవారు. తరువాత రూపాయికి నాలుగు మిర్చి బజ్జీలు (chilli bajji) . ఆ తరువాత రూపాయికి రెండు మిర్చిలు(Mirchi).. గత ఏనిమిదేళ్లుగా ఒక్క రూపాయికి ఒక మిర్చి బజ్జి అమ్ముతున్నారు.. నిత్యవసర ధరలు రోజు రోజుకు పెరుగుతున్నా వారు మాత్రం రూపాయికి మిర్చి (One Rupee mirchi) అమ్ముతున్నారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల వారు ప్రత్యేకంగా రాజంపేట్ కు వచ్చి సత్యనారాయణ మిర్చి బజ్జీలు తీసుకుని వెళతారు. చుట్టు పక్కల గ్రామాల్లో వారాంతపు సంత.. జాతరలు ఉంటే అక్కడా సత్యనారాయణ మిర్చి బండి ఉంటుంది.. ధర తక్కువ .. రుచి కూడా మంచిగా ఉండటంతో ఒక్కొక్కరు ఐదు నుంచి ఇరవై వరకు కొనుగోలు చేస్తారు. ఇలా ప్రతి రోజూ ఐదు వేలకు పైగా మిర్చీలు (Mirchi) అమ్ముతున్నారు వారు.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు అంటే దాదాపు 12 గంటల పాటు శ్రమిస్తారు.
సత్యనారాయణ (Sathyanarayana) కొడుకు రాము బీఈడీ పూర్తి చేశాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడంతో తండ్రికి తోడుగా మిర్చి బజ్జీ దందాలో భాగమయ్యాడు. రాజంపేట మండల కేంద్రంలో సత్యనారాయణ దగ్గర మిర్చి.. బజ్జీల కోసం జనం ఎగబడతారు. నలుగురు కలిస్తే చాలు మిర్చీలు తెప్పించుకుని తినడం ఆ ఊరిలో చాలా మందికి అలవాటు. దీంతో సత్యనారాయణ మిర్చీల దందా నిరాటంకంగా సాగుతోంది. మిర్చి బజ్జీల కోసం శనగ పప్పుతో పాటు బియ్యం కలిపి గిర్నీ పట్టిస్తామని సత్యనారాయణ చెబుతున్నారు.
మిర్చి బజ్జీ ధరపై తర్వాత నిర్ణయం..
50 యేళ్ల క్రితం నూనె రెండు నుంచి మూడు రూపాయలు.. శనగ పప్పు కిలో రూపాయిన్నరకు దొరికేది.. కానీ ప్రస్తుతం ఒక 15 లీటర్ల డబ్బా రెండు వేల ఆరు వందలు పలుకుతుంది.. శనగ పప్పు వందకు చేరింది. ధరలు అన్ని పెరిగి పోయాయి.. మిర్చీ దందా మొదలుపెట్టినపుడు ఒక్క రూపాయికి 16 మిర్చీలు అమ్మేవాడినని సత్యనారాయణ గుర్తు చేవఆరు. తరువాత రూపాయికి నాలుగు, ఆ తరువాత రూపాయికి రెండు మిర్చీలు అమ్మినాం.. ధరల పెరుగుదలతో గత 8 యేళ్లుగా ఒక్క రూపాయికి ఒక మిర్చి అమ్ముతున్నమని తెలిపారు. రానున్న రోజుల్లో మిర్చి బజ్జీ ధర పెంచుతామో లేదో ఇంకా నిర్ణయం తీసుకొలేదన్నారు. ప్రస్తుతం జాతరలు , వారంతాపు సంతాల్లో మిర్చి .. బజ్జీ అమ్ముతున్నామని ఆయన చెప్పారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.