నిజామాబాద్ జిల్లా బోధన్ (Bodhan in nizamabad)పట్టణంలో రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ట (Shivaji statue installation) జరిగింది. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. శివసేన (Shivasena), బీజేపీ (BJP) కార్యకర్తలు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లుగా అక్కడి వారు చెబుతున్నారు. అయితే ఇలా తెల్లారేసరికి ఓ వర్గం నాయకులు విగ్రహ ప్రతిష్ట (Statue Setup) చేయడంపై ఓ వర్గం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. ఇరువర్గాలకు చెందిన నాయకులు, స్థానిక ప్రజలు అక్కడికి భారీగా చేరుకోవడంతో పరిస్థితి మరింత్ర ఉద్రిక్తంగా మారింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకూ నచ్చజెబుతున్నారు.
విగ్రహం తొలగించాలని డిమాండ్..
బోధన్‌లో శివసేన (Shiva sena), బీజేపీ (BJP) కార్యకర్తలు రాత్రికి రాత్రి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో మైనార్టీ (Minority)కి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘటన ప్రదేశానికి ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసుల (Police) రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు. అయితే పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా ఇరువర్గాలు వినిపించుకోవడం లేదు. దీంతో బోధన్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
144 సెక్షన్..
ఈ క్రమంలోనే పలువురు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు బోధన్‌లో 144 సెక్షన్ విధించారు. అయితే బోధన్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని సీపీ వెల్లడించారు. శివాజీ విగ్రహానికి అనుమతి లేదని చెప్పారు. మత విద్వేషాలు (Religious hatred) రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే సహించబోమని హెచ్చరించారు.
కాగా, విగ్రహ రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో వివాదాలు రాజేశాయి. గతంలో ఏపీలోనూ ఇదే జరిగింది. టిప్పుసుల్తాన్ విగ్రహం వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు కోసం వైసీపీ నేతలు, స్ధానిక ముస్లింలు ప్రయత్నిస్తుండగా.. దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. నిన్న విగ్రహ ఏర్పాటుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఇవాళ విష్ణువర్ధన్‌రెడ్డి ఏకంగా విగ్రహం సందర్శనకు వెళ్లడం వివాదాన్ని మరింత పెంచింది. పరిస్థితి తోపులాట.. అరెస్టుల వరకు వెళ్లింది. ఈ విషయంపై రెండు పార్టీలు వెనక్కు తగ్గేది లేదంటున్నాయి. అధికార వైసీపీ-బీజేపీ నేతలు సై అంటే సై అంటున్నారు. బీజేపీ నేతలు కావాలనే కడప జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad