P.Mahenar, News 18, Nizambad
Nizambad; ఎక్కడో ఓ చోట ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు ఆనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా లోని గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థినులు రాత్రి చేసిన బోజనం వికటించి విపరీతమైన కడుపు నోప్పి.. వాంతులు.. విరోచనాలు అయ్యాయి.. వీరందారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు రాత్రి భోజనం వికటించడం తో విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు అయ్యాయి.. కడుపునొప్పి విపరీతంగా ఉండటం తో విద్యార్థినుల కంట నీరు ఆగలేక బోరున ఏడుస్తూ, వాంతులు చేసుకుంటూ తీవ్ర అవస్థకు గురైనారు. రాత్రి బోజనం లో బెండకాయ, పప్పు వడ్డించారని విద్యార్థినులు తెలిపారు. 30 మంది విద్యార్థిను లు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. నైట్ డ్యూటి లో ఉన్న ఉపాద్యాయులు ప్రభుత్వ ఏరియా అసుపత్రికి తరలించారు. వైద్యం అందించిన డాక్టర్ ఫుడ్ పాయిజన్ గా నిర్ధారించారు. అయితే 30 మంది విద్యార్థుల లో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. రెండు రోజుల క్రితం ప్రాథమిక పాఠశాల లో జరిగిన ఘటన మరువక ముందే గురుకుల పాఠశాల లో బాలికలకు ఫుడ్ పాయిజన్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read this also; Rajanna Sircilla: మత్తులో చిత్తవుతున్న యువకులు: రాకెట్ ఛేదించే దిశలో పోలీసు విభాగం
15 రోజుకల క్రితం పాఠశాలలో విద్యార్థుల పై ఎలుకల దాడి మరవక ముందే విద్యార్థులకు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురవ్వడం తో తల్లి దండ్రులు గురుకుల పాఠశాల సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి దండ్రులు డిమాండ్ చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని విద్యార్థులకు మంచి బోజనం అందించాల్సిన అవసరం ఏంతైనా ఉంది. నిర్లక్ష్యం వ్యవహరిస్తే విద్యార్థుల చదువు సంగతి ఏమోగాని వారు ఆనారోగ్యం పాలవుతురు. అధికారులు సుద్దమైన ఆహరం విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తసుకోవాల్సిన అవసరం ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు.. అనే విషయాన్ని మరువకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Gurukula colleges, Nizamabad District, Telangana