Home /News /telangana /

NIZAMABAD 21 PEOPLE ARE EMPLOYED IN THE ARMY IN THE VILLAGE OF ADIVI MAMIDIPALLI IN NIZAMABAD DISTRICT SNR NZB

Telangana : 20ఏళ్లుగా ఆ గ్రామంలో యువకులు కనిపించడం లేదు ..16ఏళ్లు రాగానే అదే పనిలో ఉంటారు

(ARMY VILLAGE)

(ARMY VILLAGE)

Telangana : ఎవ‌రైన బాగా చ‌దువుకొని ప్ర‌భుత్వ ఉద్యోగం సంపాధిస్తే చాలు హ్యాపీగా జీవించాలనుకుంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామ యువ‌కులు మాత్రం ఆర్మీలో ఉద్యోగం చేయాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్నారు. ఈ చిన్న గ్రామం నుంచి సుమారు 21 మంది యువ‌కులు ఇప్ప‌టికే ఆర్మీ లో వివిధ‌ ప్రాంతాల్లో విధులు నిర్వ‌హిస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India
  (P.Mahendar,News18,Nizamabad)
  ఎవ‌రైన బాగా చ‌దువుకొని ప్ర‌భుత్వ ఉద్యోగం సంపాధిస్తే చాలు హ్యాపీగా జీవించాలనుకుంటారు. కానీ నిజామాబాద్(Nizamabad)జిల్లాలోని ఓ గ్రామ యువ‌కులు మాత్రం ఆర్మీలో ఉద్యోగం చేయాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్నారు. ఈ చిన్న గ్రామం నుంచి సుమారు 21 మంది (21People)యువ‌కులు ఇప్ప‌టికే ఆర్మీ(Army)లో వివిధ‌ ప్రాంతాల్లో విధులు నిర్వ‌హిస్తున్నారు. వారి స్పూర్తితో మ‌రింత మంది యువ‌కులు ఇదే మార్గంలో ముందుకు సాగుతున్నారు. దేశం కోసం మా బిడ్డ‌లు సైన్యంలో ఉండ‌డం గ‌ర్వంగా ఉందంటున్నారు సైనికుల కుటుంబస‌భ్యులు. నిజామాబాద్ జిల్లాలోని అత్యధికంగా జవాన్లు(Jawans)కలిగిన గ్రామం ఇప్పుడు చుట్టు పక్కల గ్రామాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది.

  Crime news : వాళ్లంతా ఓ ఖతర్నాక్ బ్యాచ్ .. ఈ వీడియో చూస్తే ఇకపై ఎవరికి సాయం చేయరు  సరిలేరు మీకెవ్వరూ..
  నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామం పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది సైనికులు. ఎందుకంటే ఈ గ్రామంలో మొత్తం జనాభా రెండు వేల మంది ఉంటే అందులో 20మందికిపైగా జవాన్‌లుగా ఆర్మీలో జాబ్‌ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంటి లగ్జరీ జాబ్స్ కోసం వెంపర్లాడుతున్నారు. మంచి జీతం వారంలో రెండు రోజులు సెలవు కోసం ఎదురుచూస్తున్నారు. ఇవేమి వర్కవుట్ కాకపోతే మంచి బిజినెస్ పెట్టుకొని లైఫ్‌లో సెలిటల్వాలని చూస్తున్నారు. కాని అడవి మామిడిపల్లి వ్యవసాయ ఆధారిత గ్రామం. అయితే ఇక్కడి యువత మాత్రం ఏదో పని చేసుకొని స్థానికంగా స్థిరపడాలని ఆలోచించడం లేదు. సుమారు 22సంవత్సరాలుగా అంటే 2000 సంవ‌త్స‌రం నుంచి ఇక్కడి కుర్రాళ్లు అంతా సైన్యంలో చేరేందుకు ఎంతో ఇష్టపడుతున్నారు.  ఊరి పేరు మార్చేస్తున్న యువకులు..
  మామిడిపల్లి గ్రామంలో ఉండే యువకుల్లో నరనరాల్లో దేశభక్తి ప్రవహిస్తుందని చెప్పడానికి ఉదాహరణే ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఆర్మీలో వేర్వేరు విభాగాల్లో , వేర్వేరు రాష్ట్రాల్లో సైనికులుగా ఉద్యోగాలు చేస్తుండటం వారిలోని దేశభక్తిని చాటుతోంది. యువకులే కాదు వాళ్లు సైన్యంలో చేరడానికి తల్లిదండ్రులు సైతం అంతే ప్రోత్సహించడం ఇక్కడ మరో గొప్ప విషయంగా చెప్పుకోవాలి. దేశం కోసం సైనికుడిగా పనిచేయటం ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నారు అక్కడి యువ‌త‌. 16 ఏళ్లు నిండిన యువకులు ఈ గ్రామంలో సైనికుడిగా చేరేందుకు కసరత్తు చేస్తుంటారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఎక్కడ ఉన్నా... ఇట్టే వాలిపోతారు. అందులో సెలక్ట్ అవడానికి శ్రమిస్తారు.

  Telangana : ముందస్తు కోసం మనీ సిద్ధం .. ఇప్పటి నుంచే గ్రామల్లోకి తరలిపోతున్న నోట్ల కట్టలు  దేశ సేవ పైనే ఆసక్తి..
  ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరు ప్రత్యేకతను చాటుతుంది. ఈ గ్రామాన్ని అడవిమామిడిపల్లి అని కాకుండా జైహింద్ మామిడిపల్లి అని మార్చాలనే స్పూర్తినే కలిగిస్తోంది. ఊరి ముఖ‌ద్వారం వ‌ద్ద‌ స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శన మిస్తాయి. దేశభక్తి స్ఫూర్తిగా విగ్రహాలు నెలకొల్పిడంతో పాటు తమ బిడ్డలను దేశ రక్షణ కోసం దేశ హద్దుల పహారాకు పంపుతున్న ఆ ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని దేశ భ‌క్తులు అంటూన్నారు.

  అందరూ ఆదర్శవంతులే..
  గ్రామానికి చెందిన ఎంతో మంది దేశ సరిహద్దుల్లో , సైన్యంలో జవాన్లుగా చేరేందుకు వెళ్లిన తర్వాత పడిన కష్టాలు, కుటుంబానికి దూరమైన సందర్బాలను గుర్తు చేసుకుంటున్నారు. అన్నింటిని మించి యుక్త వయసులో తల్లిదండ్రులు తమ బిడ్డలు కళ్ల ముందు లేరని బాధను గుర్తు చేసుకుంటూ బాధపడుతూనే దేశానికి సేవ చేయడానికి వెళ్లారనే గర్వంతో కాలం గడుపుతున్నామని చెబుతున్నారు. గ్రామ మాజీ స‌ర్పంచ్ గంగోనే సంతోష్ చెబుతూ తమ ఊరి నుంచి 21మంది ఆర్మీలో చేరితో ముగ్గురు రిటైర్ అయ్యారని మిగిలిన వాళ్లంతా సర్వీస్‌లో ఉన్నట్లు తెలిపారు. వాళ్ల స్పూర్తితోనే మరో ఎనిమిది మంది యువకులు అగ్నిప‌థ్ కు దరఖాస్తులు చేసుకు న్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Telangana News

  తదుపరి వార్తలు