Bheeshma: నితిన్ భీష్మకు చిక్కులు...పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...

భీష్మ పోస్టర్ Twitter

సినిమా టైటిల్ తమకు అభ్యంతరకరంగా ఉందని తెలంగాణ గంగపుత్ర సంక్షేమ సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Share this:
    నితిన్ నటించిన భీష్మ టాలివుడ్ లో మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓ వివాదంలో ఇరుక్కుంది. సినిమా టైటిల్ తమకు అభ్యంతరకరంగా ఉందని తెలంగాణ గంగపుత్ర సంక్షేమ సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలో హీరో అమ్మాయిల వెంటపడే లవర్ బాయ్‌ అలాంటి కేరక్టర్ కు భీష్మాచార్యుడి పేరు ఎలాపెడతారని సంఘం ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. అంతేకాదు సినిమాలోని డైలాగులు, చిత్ర టైటిల్ తమను అవమానించేలా ఉందని మలక్‌పేట పోలీసులకు సంఘం అధ్యక్షుడు పెంటం రాజేశ్ ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, రచయిత, నటుడు నితిన్, సితార ఎంటర్‌ప్రైజెస్, పీడీపీ ప్రసాద్, ఎడిటర్ నవీన్ నూలిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    ఫిర్యాదుపై మలక్‌పేట పోలీసులు స్పందిస్తూ... భీష్మ సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయిత తదితరులపై ఫిర్యాదు అందిందని దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
    Published by:Krishna Adithya
    First published: