హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: TSPSC పేపర్ లీక్ కామనే అంటూ మంత్రి కామెంట్..ఇంద్రకరణ్‌రెడ్డి బర్తరఫ్‌కు విపక్షాలు పట్టు

Telangana Politics: TSPSC పేపర్ లీక్ కామనే అంటూ మంత్రి కామెంట్..ఇంద్రకరణ్‌రెడ్డి బర్తరఫ్‌కు విపక్షాలు పట్టు

bhatti,indrakaranreddy

bhatti,indrakaranreddy

Telangana Politics: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంపై అధికార , విపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. అయితే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేపర్ లీక్ వ్యవహాం కామన్ అంటూ కొట్టిపారేయడంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. బాధ్యతరాహిత్యంగా మాట్లాడిన ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రిపదవి నుంచి బర్తరఫ్ చేయలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nirmal, India

(K.Lenin,News18,Adilabad)

తెలంగాణలో టీఎస్‌పీఎస్‌సీ(TS PSC) పేపర్ లీక్ (Paper Leak)వ్యవహారం సంచలనం రేపింది. జరిగింది పొరపాటు కాదు..ఖచ్చితంగా అధికార పార్టీ నేతల నేరపూరిత చర్యే..ఇందుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని విపక్షాలు వాదిస్తుంటే..సాక్షాత్తు మంత్రిగా ఉన్నటువంటి ఓ అధికార పార్టీకి చెందిన నాయకుడు పేపర్ లీక్ అంశం సర్వ సాధారణే అని స్టేట్‌మెంట్ ఇవ్వడం ఇప్పుడు మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. అంతే కాదు ఆధారాలు లేకుండా ఆ నెపాన్ని ప్రభుత్వంపై మోపడం మూర్ఖత్వమంటూ అటు కాంగ్రెస్ , ఇటు బీజేపీ(BJP) అధ్యక్షులపై విమర్శలు చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. నిర్మల్ (Nirmal)జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (Indrakaran Reddy )ప్రెస్‌మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేయడంపై విపక్ష నేతలు తిట్టిపోస్తున్నారు. బాధ్యత కలిగిన మంత్రి స్థానంలో ఉండి ఈవిధంగా మాట్లాడవచ్చా అంటూ తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్(Congress), బీజేపీ నేతలు.

మంత్రి నోటి నుంచి ఆ మాట..

టీఎస్‌ పీఎస్‌సీ పేపర్ లీకేజీ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వాళ్లపై కేసులు నమోదు చేసి..అనుమానితులకు నోటీసులు ఇస్తున్న సమయంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు, ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. పేపర్ లీకేజీలు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయని, దీనిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఇంద్రకరణ్ రెడ్డి. ఈ విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఉందని కేటిఆర్ పేరును ప్రస్తావించడం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూర్ఖత్వమని విమర్శించారు మంత్రి.ఎన్నో రకాలుగా పేపర్ లీక్ అవుతుంటాయని జరిగిన పొరపాటును సమర్ధించుకొచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.

కామెంట్స్‌పై కౌంటర్స్..

బీజేపీ, కాంగ్రెస్ నేతలు. ఇళ్లు, ఊళ్ళు వదిలేసి కష్టపడుతున్న నిరుద్యోగులకు తెలుసు వాళ్ళ గోస ఏంటో..... వాళ్ళని అడుగు నువ్వు అంటున్న సర్వ సాధారణ విషయం వాళ్ళ జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేసిందో అంటూ తెలంగాణ యువజన కాంగ్ెస్ నేతలు విమర్శించారు. ఇదే విషయంపై సిఎల్పి నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ పేపర్ లీకేజీ సాధారణమన్న మంత్రి ఆ పదవిలో ఉండే అర్హత లేదని ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఆధారాలు చూపించమని సవాల్..

అయితే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేపర్ లీకేజీ వ్యవహారాన్ని చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేయడమే కాకుండా ఈ లీకేజీకి ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లుగా ఆధారాలు ఉంటే చూపించమని డిమాండ్ చేసారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్సీ కవితను ఈడి వేధింపులకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. మంత్రులు మల్లారెడ్డి, కమలాకర్ పైన కూడా ఈడీ, సిబిఐ వేధింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు మంత్రి.

ఒకే ఒక్క కేసీఆర్ ..

ప్రధానమంత్రిపైన  ఎదురు దాడి చేసిన  ఏకైక సీఎం  కేసిఆర్ అన్నారు. రాష్ట్రంపై కేంద్రం పక్షపాత ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు ఇంద్రకరణ్‌రెడ్డి. బీజేపీలో  ఒక్కరిపైన  కూడా ఈడి, సిబిఐ విచారణ జరపలేదని లేదని ఎద్దేవా చేశారు. అదాని విషయంపై ఎందుకు బీజేపీ నేతలు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ భారత రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ కోసం కిషన్ రెడ్డి రాజీనామా చేయమంటే  పారిపోయాడని ఎద్దేవా చేశారు.

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైల్ కోసం భూసేకరణ తప్పని సరి ..ఎంత అవసరమంటే

మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్..

అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లలో టిఆర్ఎస్ పార్టీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో 23 వ తేదీ నుండి బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

First published:

ఉత్తమ కథలు