హోమ్ /వార్తలు /తెలంగాణ /

Camera in Bathroom : మహిళల బాత్రూంలో సెల్ కెమెరా... ! నిందితుడిపై నిర్భయ కేసు.. విచారణలో సంచనాలు.. !

Camera in Bathroom : మహిళల బాత్రూంలో సెల్ కెమెరా... ! నిందితుడిపై నిర్భయ కేసు.. విచారణలో సంచనాలు.. !

Camera in Bathroom : మహిళల బాత్రూంలో సెల్ కెమెరా... ! నిందితుడిపై నిర్భయ కేసు..

Camera in Bathroom : మహిళల బాత్రూంలో సెల్ కెమెరా... ! నిందితుడిపై నిర్భయ కేసు..

Camera in Bathroom : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ ఫుడ్ కోర్టులోని బాత్రూంలో సెల్‌ఫోన్ కెమెరా కలకలం రేపిన విషయం తెలిసిందే... మహిళల బాత్రూంలో సెల్‌ఫోన్‌తో రహస్య రికార్డింగ్ జరుగుతున్నట్టు ఓ మహిళ గుర్తించడంతో హౌస్ కిపింగ్ చేస్తున్న బాయ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసి నిర్భయ కేసు నమోదు చేశారు. కాగా కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఇంకా చదవండి ...

ఫుడ్‌కోర్టు (food court)మహిళల బాత్రూంలో సెల్‌ఫోన్ కెమెరా...(cell camera) వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసందే... జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్ ఫుడ్ కోర్టులో ఈ కేమెరాను గుర్తించారు. కాగా ఫుడ్‌ కోర్టుకు ఓ మహిళ నేపథ్యంలోనే బాత్రూంలో(Bathroom) ఆన్ చేసి ఉన్న సెల్‌ఫోన్‌ను గుర్తించింది. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు (police)ఫిర్యాదు చేసింది.

స్పందించిన పోలీసులు ఫుడ్‌కోర్టులోని సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సెల్ ఫోన్ గత ఇరవైనాలుగు గంటలుగా ఆన్‌లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా బాత్రూంలో కెమెరా పెట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించి అరెస్ట్(arrest) చేశారు. ఫుడ్‌కోర్టులో బాత్రూం క్లీనింగ్ చేసే బెనర్జీ అనే వ్యక్తి ఇందుకు కారణమని పోలీసులు కనిపెట్టారు. దీంతో బెనర్జీని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఇది చదవండి : రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చ


కాగా ఈ కేసులో అనేక అనుమాలకు తలెత్తుతున్నాయి. బాత్రూం క్లీన్ చేసే బాయ్‌ స్వయంగా కెమెరాను పెట్టాడా.. లేక ఇతరులు ఎవరైనా .. ప్రొత్సహించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే లేడీస్( ladies)  బాత్రూం క్లీనింగ్‌కు మైనర్ బాయ్‌ని నియమించడం పై కూడా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా అరెస్ట్ చేసిన మైనర్ బాలుడు తనకు మతి మరుపు ఉందని చెప్పడంతో మరిన్ని అనుమానాలు తలెత్తున్నాయి. మరోవైపు అంతకు ముందు కూడా స్పై కెమెరా కూడా బిగించినట్టు తెలుస్తోంది. దీంతో ఫుడ్ కోర్డు యజమాని ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. పోలీసులకు దొరికిన వీడియో ఫుటేజీలో సుమారు ఇరవై రోజుల వరకు రికార్డు అయినట్టు ఉన్న వీడియోలు లభించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు క్షుణ్ణంగా కేసును దర్యాప్తు చేయడంతో పాటు బాత్రూం క్లీనర్ బెనర్జీపై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇది చదవండి : మరోసారి సీఎం కేసీఆర్ ఢిల్లీకి.. రెండు రోజుల పాటు మకాం.. !


కాగా ఇటివల ఓ మహిళ తన బాత్రూంలో స్నానం చేస్తుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ( social media ) చక్కర్లు కొడుతుండగా తాజాగా ఈ సెల్ కెమెరా కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో చిన్నారుల నుండి మహిళల వరకు అత్యాచారాలు( rapes ) జరుగుతుండగా మరోవైపు ఇలాంటీ దుర్మార్గపు చర్యలకు దుండగులు దిగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. అయితే ఇలా ఎన్ని రోజులుగా ఫుడ్ కోర్టులో సెల్ రికార్డింగ్ వ్యవహరం నడుస్తుందో అనే ఆందోళన చెలరేగుతోంది. ఉన్నత వర్గాల వారు నివసించే ప్రాంతంలో కెమెరాలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే అనుమానాలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి. అయితే ఇది వ్యక్తిగతంగా జరిగిందా.. లేక ఎవరైనా ప్రొత్సహించారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

First published:

Tags: Crime news, Hyderabad

ఉత్తమ కథలు