కరోనాపై జనాల్లో అవేర్నెస్తో పాటు సెల్ఫ్ కేర్ పెరిగిపోయింది. ఆరోగ్యంపై అలెర్ట్‌గా ఉంటూ జలుబు, దగ్గు, నీరసం, లైట్ ఫీవర్ అనిపించినా వెంటనే మెడిసిన్వేసుకోవడం, లేదంటే హాస్పటల్‌కు వెళ్తున్నారు. వింటర్ సీజన్ కావడంతో ఇన్ఫెక్షన్స్, ఫ్లూ, వైరస్ సింప్టమ్స్ ఒకేలా ఉంటుండగా టెన్షన్‌కు గురై ముందు జాగ్రత్తగా చెకప్ లు కూడా చేయించుకుంటున్నారు. Master Health Checkup..! కార్పొరేట్ దవాఖానలకే పరిమితమైన ఈ సదుపాయం ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కూడా అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా 40 ఏండ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారైనా వైద్యపరీక్షలు (Health tests) చేయించుకొంటే, రాబోయే వ్యాధులను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడవచ్చునని, ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చునని వైద్యులు చెప్తుంటారు. ఈ వైద్య పరీక్షలను మాస్టర్ హెల్త్ చెకప్ (Master Health Checkup) అంటారు. కరోనా నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరిగింది. కార్పొరేట్ దవాఖానల కంటే తక్కువ ధరలకే నిమ్స్ (NIMS)లో ఈ పరీక్షలు (Health Checkup) నిర్వహిస్తున్నారు.
నిమ్స్ ఆసుపత్రి ఆఫర్..
కొవిడ్ షురువైన టైమ్‌లో హాస్పిటల్స్ కి వెళ్లలేక, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక జనాలు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆన్లైన్ కన్సల్టేషన్, వీడియో కాల్స్ లో ట్రీట్మెంట్ ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయి. హాస్పిటల్ కు వెళ్లాలంటేనే భయంతో వణికిపోయారు. కరోనా రెండు వేవ్ లోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. చాలామంది సొంతంగా మెడికేషన్, డైట్లు పాటించడం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఫోర్త్ వేవ్ , ఒమిక్రాన్ వేరియంట్ వస్తుందనే కారణాలతో మైల్డ్ సింప్టమ్స్ కనిపించినా వెంటనే హాస్పిటల్స్ కు వెళ్లి చెకప్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రి ప్రజలకు ఆఫర్ ప్రకటించింది. ఇలా తక్కువ ధరలకే వైద్య పరీక్షలు చేయడానికి ముందుకొచ్చింది.
12 రకాల వైద్య పరీక్షలు..
తెలంగాణ ప్రభుత్వం నిమ్స్‌లో ఇదివరకే ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌లో 12 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్టర్ హెల్త్ చెకప్‌తో పాటు ఆయా వ్యాధులు, ప్రధాన అవయవాలకు సంబంధించిన వైద్య పరీక్షలను సంబంధిత వైద్యుల కన్సల్టేషన్ సిఫారసు మేరకు నిర్వహిస్తున్నట్టు నిమ్స్ వైద్యులు వివరించారు.
ఇక ధరల విషయానికొస్తే.. మాస్టర్ హెల్త్ చెకప్, రూ. 2,800 డయాబెటిక్ హెల్త్ చెకప్ రూ. 2,100 , ఉమెన్ వెల్ నెస్ కప్ రూ. 4.700, ఫీవర్ ప్రొఫైల్ రూ. 4,500, ఎనీమియా పరీక్ష రూ. 2,000, రెస్పిరేటరీ హెల్త్ చెకప్ బోన్ &జాయింట్స్ హెల్త్ చెకప్, కార్డియాక్ హెల్త్ చెకప్ 1.500, 2,400 , 3.800 , కిడ్నీ హెల్త్ చెకప్, 1,900 , క్యాన్సర్ స్క్రీనింగ్ (పురుషులు) 2.000, క్యాన్సర్ స్క్రీనింగ్ (మహిళలు) రూ. 3.500, టోటల్ థైరాయిడ్ టెస్ట్ రూ. 3.700, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ రూ. 2.200, హోల్ బాడీ చెకప్ (పురుషులు) 15.000 లుగా మహిళలకు 16వేలుగా ధరలు ఉన్నాయి.
ఎప్పటిలోగా పూర్తవుతాయి?
కాగా, నిమ్స్‌లోని ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. హెల్త్‌చెకప్‌లన్నీ రెండు, మూడు గంటల్లోనే పూర్తవుతాయి. సింగిల్ విండో ద్వారా అన్నీ పరీక్షలు ఒకేచోట నిర్వహిస్తున్నాం. ముందుగా అపాయింట్‌మెంట్స్ తీసుకోవాల్సిన అవసరంగానీ, నిరీక్షించాల్సిన అవసరంగానీ ఉండదు. దీంతో హెల్త్‌చెకప్ చేయించుకొనేవారికి అన్ని సేవలు ఒకేచోట లభించడంతో పాటు సమయం ఆదా అవుతోంది.హెల్త్ చెకప్‌కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వస్తున్నట్టు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.