తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడిపై NIA కేసు నమోదు... ఎందుకంటే...

Telangana : తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి బండారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయా? ఆయన రిక్రూట్‌మెంట్లు చేశారా?

news18-telugu
Updated: December 10, 2019, 10:47 AM IST
తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడిపై NIA కేసు నమోదు... ఎందుకంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Telangana : తెలంగాణ విద్యార్థుల్ని ఆలోచనలో పడేసే ఓ అంశం తెరపైకి వచ్చింది. ఏంటంటే... తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి బండారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయనీ, ఆయన ఇద్దర్ని మావోయిస్టులుగా రిక్రూట్‌మెంట్ చేశారనీ, మరో ఐదుగురితో మావోయిస్టు పార్టీ తరపున పని చేయిస్తున్నారనే ఆరోపణలతో... జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హైదరాబాద్ విభాగం కేసు నమోదు చేసింది. మద్దిలేటి బండారితోపాటూ... నలుగురిని మహబూబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మద్దిలేటి... మావోయిస్టుల తరపున పనిచేస్తూ... నిధులు కూడా సేకరిస్తున్నారని NIA కేసు నమోదు చేసింది. అక్టోబర్ 15న ఇలాంటి ఆరోపణలతోనే ఆయన్ని జోగులాంబ-గద్వాల పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్... నల్లకుంటలోని ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. కొన్ని డాక్యుమెంట్లు, ఎలక్ట్రానికి పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు. మద్దిలేటి రెండు తెలుగు రాష్ట్రాల్లో యువతను ప్రేరేపించి మావోయిజంలో చేరేలా చేస్తున్నారనేందుకు బలమైన ఆధారాలు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందర్ని ఛత్తీస్‌గఢ్ పంపినట్లు సమాచారం. త్వరలో మద్దిలేటిని కస్టడీలోకి తీసుకునేందుకు NIA టీమ్... కోర్టులో పిటిషన్ వేస్తుందని తెలిసింది.

 

రెయిన్‌బో ఫొటోగ్రఫీ... సెలబ్రిటీల పరిచయ వేదిక
ఇవి కూడా చదవండి : 

విమానంలో ప్రయాణికురాలిని కుట్టిన తేలు... ఆ తర్వాత...ఆ బొకే ఇచ్చినందుకు రూ.5000 ఫైన్ వేసిన IAS ఆఫీసర్...

భర్తను చంపేందుకు భార్య స్కెచ్... ఆ తర్వాత...

పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం...

మిస్ యూనివర్స్‌ 2019... సౌతాఫ్రికా బ్యూటీ జొజిబినీ టున్జీ
First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>