హోమ్ /వార్తలు /తెలంగాణ /

NIA in Hyderabad: యువతి మిస్సింగ్​ కేసు.. హైదరాబాద్​లో ఎన్​ఐఏ ప్రత్యక్షం.. అసలేం జరుగుతోంది?

NIA in Hyderabad: యువతి మిస్సింగ్​ కేసు.. హైదరాబాద్​లో ఎన్​ఐఏ ప్రత్యక్షం.. అసలేం జరుగుతోంది?

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

తెలంగాణలో ఎన్​ఐఏ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ యువతి అదృశ్యం కావడమే దీనికి కారణం, అయితే ఓ మిస్సింగ్​ కేసు విషయంలో ఎన్​ఐఏ దిగడం ఏంటి? అసలేం జరుగుతోంది.?

  తెలంగాణలో (Telangana) అకస్మాత్తుగా ఎన్​ఐఏ (National Investigation Agency) సోదాలు నిర్వహించడం కలకలం సృష్టించింది. ఉప్పల్‌ చిలుకానగర్‌లో ఎన్‌ఐఏ(NIA) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు అడ‍్వకేట్‌ శిల్ప ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. నర్సింగ్​ విద్యార్థి రాధ మిస్సింగ్‌ (Nursing students Radha Missing) కేసులో భాగంగా  ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.  ఈ నేపథ్యంలో ఏకకాలంలో అధికారులు మూడు చోట్ల సోదాలు (Search) నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా.. పలు డాక్యుమెంట్లను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నర్సింగ్ విద్యార్థి రాధ మిస్సింగ్‌ కేసులో భాగంగా శిల్పను విచారించారు ఈ క్రమంలో శిల్పను ఎన్‌ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శిల్పను ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు.

  కొన్నేళ్ల క్రితం విశాఖపట్నంలో రాధ అదృశ్యమైంది. రాధను మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళ సంఘం నాయకులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఏడాది మే 31వ తేదీన కేసు రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని NIA కు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటీవల ఈ కేసును ఎన్‌ఐఏ టేకప్ చేసింది. అయితే రాధను నక్సల్స్‌లో చేర్చారని అడ్వకేట్‌ శిల్పతో పాటు మరికొందరు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే NIA ఏకకాలంలో మూడు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.

  కుట్ర పూరితంగా శిల్పపై కేసులు..

  కాగా, మెదక్‌  (Medak) జిల్లా చేగుంటలోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టు అగ్రనేత దుబాసి శంకర్ కొడుకు ఇంట్లో  సోదాలు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే దాడులు మొదలయ్యాయి. నర్సింగ్​ విద్యార్థి రాధ మిస్సింగ్ కేసుపై  NIA అధికారులు ఆరా తీశారు. అయితే కుట్ర పూరితంగా శిల్పపై కేసులు పెడుతున్నారని శిల్ప కుటుంబ సభ్యులు ఆరోపించారు. నోటీసు కూడా ఇవ్వకుండా ఇంట్లో సోదాలు చేపట్టారని చెప్పారు. హైకోర్టులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సమస్యలపై శిల్ప ఫైట్ చేస్తుందని తెలిపారు

  మూడున్నరేళ్లుగా మిస్సింగ్​..

  ఏపీలోని విశాఖపట్నం పరిధిలో ఉండే రాధ అనే నర్సింగ్ విద్యార్ధిని గత మూడున్నరేళ్లుగా  కనిపించకుండా పోయింది. రాధ కనిపించకుండా పోవడంపై విశాఖపట్నం పోలీసులు మావోయిస్టులపై తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. ఇప్పుడు దానిని ఎన్ఐఏ టేకప్ చేసింది. కిడ్నాప్, అక్రమ నిర్బంధం, చట్టవిరుద్ధంగా సమావేశం, అల్లర్లు, నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.  రాధ తల్లి పల్లెపాటి పోచమ్మ తన ఫిర్యాదులో.. ‘‘నా చిన్న కూతురు రాధ నర్సింగ్ కోర్స్ చేస్తుండగా.. చైతన్య మహిళా సంఘం (CMS) నాయకులు దేవేంద్ర, స్వప్న, చుక్క శిల్ప తదితరులు నా కూతురు కాలేజీకి వస్తుండడంతో మావోయిజం భావజాలం ఆమె మనసులోకి ఎక్కింది. 2017 డిసెంబర్‌లో ఎవరికో వైద్యం అందించాలనే నెపంతో దేవేంద్ర రాధను బలవంతంగా తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తొమ్మిది నెలల తర్వాత విశాఖపట్నం జిల్లా పెద్దబయలు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌ అగ్రనేతలు ఉదయ్‌, అరుణతో కలిసి నా కూతురు అక్రమంగా మావోయిస్టు పార్టీలో చేరి పని చేస్తోందని తెలిసింది’’ అని తెలిపారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad, Missing cases, NIA

  ఉత్తమ కథలు