తెలంగాణలో రెండు కొత్త టోల్ ప్లాజాలు..రెట్టింపు ఆదాయమే లక్ష్యం

సెప్టెంబర్ వరకు ఈ రెండు టోల్‌ఫ్లాజాల నిర్మాణం పూర్తి అవుతుందని NHAI అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 18 టోల్‌ప్లాజాలు ఉండగా ప్రస్తుతం ఏర్పాటయ్యే రెండింటితో కలిపి 20కి చేరుకోనున్నాయి.

news18-telugu
Updated: June 30, 2020, 8:08 PM IST
తెలంగాణలో రెండు కొత్త టోల్ ప్లాజాలు..రెట్టింపు ఆదాయమే లక్ష్యం
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలో మరో రెండు కొత్త టోల్ ప్లాజాలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా నిర్మించబోయే రెండు టోల్‌ప్లాజాల్లో ఒకటి స్టేషన్ ఘన్‌పూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారి 163పై నిర్మాణం జరుగుతుండగా.. మరొకటి వరంగల్ బైపాస్ వద్ద నిర్మిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఆరు నుంచి ఎనిమిది గేట్లతో టోల్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ వరకు ఈ రెండు టోల్‌ఫ్లాజాల నిర్మాణం పూర్తి అవుతుందని NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 18 టోల్‌ప్లాజాలు ఉండగా ప్రస్తుతం ఏర్పాటయ్యే రెండింటితో కలిపి 20కి చేరుకోనున్నాయి.

సాధారణ రోజుల్లో తెలంగాణలోని టోల్‌ఫ్లాజాల ద్వారా నెలకు రూ.80 నుంచి 90 కోట్ల ఆదాయం సమకూరేది. లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 50 రోజులకు పైగా ఆదాయం పడిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో వాహనాలను ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో టోల్‌ప్లాజాల వద్ద ఆదాయం పెరిగింది. మే నెలలో సుమారు రూ.59 కోట్లు, జూన్ నెలలో (21 వరకు) రూ.55.6 కోట్ల ఆదాయం టోల్‌ప్లాజాల ద్వారా సమకూరిందని NAHI అధికారులు తెలిపారు. ఈ రెండు ప్లాజాలు ప్రారంభమయితే ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

First published: June 30, 2020, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading