హోమ్ /వార్తలు /తెలంగాణ /

News18 Telugu- ShareChat Poll: జీహెచ్ఎంసీలో తక్కువ ఓటింగ్ ఎవరికి లాభిస్తుంది? న్యూస్18 తెలుగు - షేర్‌చాట్ ఆన్ లైన్ పోల్‌‌ రిజల్ట్స్

News18 Telugu- ShareChat Poll: జీహెచ్ఎంసీలో తక్కువ ఓటింగ్ ఎవరికి లాభిస్తుంది? న్యూస్18 తెలుగు - షేర్‌చాట్ ఆన్ లైన్ పోల్‌‌ రిజల్ట్స్

News18Telugu - ShareChat (ప్రతీకాత్మక చిత్రం)

News18Telugu - ShareChat (ప్రతీకాత్మక చిత్రం)

‘GHMC ఎన్నికల్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదుకావడం ఏ పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు?’ అంటూ న్యూస్ 18 తెలుగు - షేర్ చాట్ సంయుక్తంగా ఓ ఆన్ లైన్ సర్వేను నిర్వహించాయి.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్దగా ఓటింగ్ నమోదు కాలేదు. డిసెంబర్ 1న జరిగిన ఓటింగ్‌లో కేవలం 46.55శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ. కానీ, అనుకున్నంత స్థాయిలో నగర జనం ఓట్లు వేయలేదనే వాదన ఉంది. ఈ క్రమంలో ‘GHMC ఎన్నికల్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదుకావడం ఏ పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు?’ అంటూ న్యూస్ 18 తెలుగు - షేర్ చాట్ సంయుక్తంగా ఓ ఆన్ లైన్ సర్వేను నిర్వహించాయి. ఈ సర్వేలో పాల్గొన్న నెటిజన్లు తమ అభిప్రాయాలను స్పష్టంగా పేర్కొన్నారు. తక్కువ ఓటింగ్ శాతం బీజేపీకే లాభిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. బీజేపీకి లబ్ధి జరుగుతుందని అత్యధికంగా 40.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే, తక్కువ ఓటింగ్ శాతం అధికార టీఆర్ఎస్ పార్టీకి మేలు చేస్తుందని 36.3 శాతం మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇతరులకు లాభం చేస్తుందని 18.7శాతం మంది ఓటు వేశారు. ఎంఐఎం పార్టీకి మేలు జరుగుతుందని 4.5 శాతం మంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని న్యూస్18 తెలుగు - షేర్‌చాట్ సంయుక్త సర్వేలో పంచుకున్నారు.

‘GHMC ఎన్నికల్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదుకావడం ఏ పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు?’

టీఆర్ఎస్ - 36.3 శాతం

బీజేపీ - 40.6 శాతం

ఎంఐఎం - 4.5 శాతం

ఇతరులు - 18.7 శాతం

జీహెచ్ఎంసీలో150 డివిజన్లు ఉన్నాయి. డిసెంబర్ 4న ఎన్నికల కౌంటింగ్ , ఫలితాలు ఉంటాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మెహిదీపట్నంలో మొదటి రిజల్ట్ వస్తుంది. మరోవైపు హైదరాబాద్ నగరంలో 48 గంటల పాటు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేయడానికి అనుమతి లేదని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. 48 గంటల పాటు ర్యాలీలు బ్యాన్ చేసినట్టు చెప్పారు.  ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు  వైన్ షాపులు కూడా మూసి ఉంటాయి.

జీహెచ్ఎంసీలో ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేశారు. ఒక హాల్ కి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం 8,152 మంది కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. 31 మంది కౌంటింగ్ పరిశీలకులు ఉంటారు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సీసీ టీవీలు ఏర్పాటు అయ్యాయి. ఒక రౌండ్ కి 14,000 ఓట్లు లెక్కింపు జరగనుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావాలి. బ్యాలెట్ పత్రాలను లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు.

గ్రేటర్ పరిధిలో 74,67,256 ఓట్లు ఉండగా 34,50,331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18,60,040 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15,90,219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

First published:

Tags: GHMC Election Result, Hyderabad - GHMC Elections 2020, News18, Social Media

ఉత్తమ కథలు