Home /News /telangana /

NEWS18 IMPACT ACTION AGAINST GRAVEYARD MUTAWALLIS AFTER THEY DENIED BURIAL OVER CORONAVIRUS SUSPICIONS MUSLIM MAN LAID TO REST IN HINDU GRAVEYARD BA

News18 Impact | ముస్లిం వ్యక్తి అంత్యక్రియలకు స్థలం నిరాకరణ.. స్పందించిన వక్ఫ్ బోర్డు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ ముస్లిం చనిపోతే అతడి దేహాన్ని ఖననం చేయడానికి శ్మశాన వాటిలో స్థలం నిరాకరించిన శ్మశానవాటికల నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది.

    ఓ ముస్లిం చనిపోతే అతడి దేహాన్ని ఖననం చేయడానికి శ్మశాన వాటిలో స్థలం నిరాకరించిన శ్మశానవాటికల నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. ఈ ఘటనపై న్యూస్ 18 ఉర్దూ ప్రసారం చేసిన కథనానికి తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం స్పందించారు. హైదరాబాద్ హైదర్షా కోట్‌లోని గంధంగూడలో ఉండే ఓ ముస్లిం గుండె పోటుతో చనిపోయాడు. అయితే, అతడిని ఖననం చేసేందుకు స్థలం కోసం అతడి బంధువులు ఐదు శ్మశాన వాటికల వద్ద తిరిగారు. ఎవరూ స్థలం ఇచ్చేందుకు అంగీకరించలేదు. చివరకు హిందువుల శ్మశాన వాటికలో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై న్యూస్ 18 ఉర్దూ కథనాలు ప్రసారం చేసింది. దీన్ని ఆధారంగా తీసుకుని తెహ్రీక్ ముస్లిం సుబాన్ వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన బోర్డు చైర్మన్ సలీమ్ మాట్లాడుతూ ‘శ్మశాన వాటికలు ఎవరి సొంత ప్రాపర్టీ కాదు. ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన వీడ్కోలు ఉండాలి. రాష్ట్రంలోని అన్ని శ్మశాన వాటికలకు ఆదేశిస్తాం.’ అని అన్నారు. మరోవైపు మజ్లిస్ బచావో తెహ్రీక్, ఏఐఎంఐఎం కూడా దీనిపై స్పందించాయి. ఇలాంటి అమానవీయ ఘటనలకు శ్మశాన వాటికల నిర్వాహకులు పాల్పడవద్దని సూచించాయి.

    (Reported by: అనీస్ ఉర్ రెహ్మాన్ ఖాన్, న్యూస్‌18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Hyderabad, Muslim Minorities

    తదుపరి వార్తలు