Karimnagar : రోజు.. ఫోన్‌లో మాట్లాడుతుందంటూ స్కెచ్ వేసిన భర్త.. పెళ్లైన రెండు నెలలకే...100కు డయల్ చేశాడు...!

భార్యను హత్య చేసిన భర్త

Karimnagar : పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..అప్పుడే ఓ యువతి హత్యకు గురైంది..భర్త కక్షగట్టి నవ వధువును విచక్షణరహితంగా కత్తులతో పొడిచాడు అడ్డుకోవడంతో... గొడ్డలితో నరికాడు.. దీంతో రక్తపుమడుగులో ఉన్న భార్యను వదిలి తాపిగా తన పనికి తాను వెళ్లిపోయాడు.. ఈ హత్య ఈ నెల 26న జరగగా పోలీసులు రెండు రోజుల వ్వవధిలోనే తమ సాంకేతికను ఉపయోగించి మర్డర్ మిస్టరిని చేధించారు..

 • Share this:
  హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లికి చెందిన మ్యాదరి అనిల్‌తో హుజూరాబాద్‌కు చెందిన ప్రణాళిక అనే యువతితో గత మే 21న పెళ్లి జరిగింది. అంటే పెళ్లి జరిగి సరిగ్గా మూడు నెలలు అవుతోంది.కాగా పెళ్లికి ముందు ప్రణాళిక బాసర ట్రిపుల్ ఐటిలో చదువుకుంది. ఇక అనిల్ హుస్నాబాద్‌లో ఓ బ్యారటీ షాపును నిర్వహిస్తున్నాడు. అయితే పెళ్లి జరిగినప్పటి నుండి భార్యను అనిల్ అనుమానంతో చూస్తున్నాడు. ఆమె ఎప్పుడు ఇతరులతో ఫోన్ మాట్లాడడం ఆయన అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. దీంతో ఇలాంటీ భార్య తనకు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చాడు. తనను మోసం చేసిందనే ఆలోచనలోకి వెళ్లిన అనిల్ ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు.

  ఈ నేపథ్యంలోనే ఆషాడమాసం కావడంతో ప్రణాళిక కొద్ది రోజుల క్రితమే తల్లిగారి ఇంటికి వెళ్లింది. అప్పటికే అనుమానంతో అనిల్ ఆమెను ఎక్కువ రోజులు అక్కడ ఉంచలేదు..దీంతో ఈనెల 18న తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. ముందస్తు వ్యుహంతో ఉన్న అనిల్ ఈ నెల ఆమెను హత్య చేసేందుకు స్కెచ్ వేశాడు. ఇందుకోసం యథావిధిగా ఆరోజు బ్యాటరీ షాపుకు వెళ్లాడు. అంతకు ముందే ఓ కత్తిని కొని ఇంట్లో పెట్టాడు. కాగా ఎవరికి అనుమానం రాకుండా తన ఫ్రెండ్ షాపు వద్ద తన బైకును పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. అయితే అప్పుడు కూడా ప్రణాళిక ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండడం గమనించిన అనిల్ మరింత ఆగ్రహంతో ఊగిపోయాడు.

  ఆ వెంటనే చుట్టుపక్కల వారికి వినపడకుండా ఇంట్లో టీవీ సౌండ్‌ను ఎక్కువ చేశాడు. అనంతరం ఆమెపై కత్తితో దాడి చేశాడు. కాని ప్రణాళిక అడ్డుకోవడడంతో పెనుగులాట జరిగింది. ఆ వెంటనే పక్కనే ఉన్న గొడ్డలితో ఆమెను విచక్షణ రహితంగా నరికాడు. అనంతరం ఆమెను రక్తపు మడుగులోనే ఉంచి మెల్లగా అక్కడ నుండి జారుకున్నాడు. రక్తపు మరకలతో ఉన్న బట్టలను మూటగట్టాడు. హత్యకు ఉపయోగించి ఆయుధాలను కడిగాడు. దోపిడి జరిగినట్టు చిత్రీకరించేందుకు నగలు తీసుకుని ఇంట్లో వస్తువులను చిందరవందర చేశాడు. అనంతరం బట్టల మూటను ఓ చెరువు వద్ద పడేసి..తన స్నేహితుడికి ఫోన్ చేసి అక్కడ మద్యం సేవించాడు.

  ఇక సాయంత్రం వ్యవసాయ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు వచ్చిన తల్లిదండ్రులు ప్రణాళిక హత్య విషయం ఫోన్ చేయడంతో ఇంటికి చేరుకున్నాడు. అనంతరం నిందితుడే..డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు..అయితే సంఘటన స్థలాన్ని నేరుగా సీపి కమహాసన్ రెడ్డి పరిశీలించారు. సాంకేతిక కారణాలతో కేసును చేధించారు. భర్తను అనుమానించిన పోలీసులు తమ స్టైల్లో విచారణ జరిపారు. దీంతో నిందుతుడు హత్య చేసినట్టు ఒప్పువడంతో నిందితున్ని మీడియా ముందుకు తీసుకువచ్చారు.
  Published by:yveerash yveerash
  First published: