Karimnagar : ఇంట్లో ఒంటరిగా ఉన్న కొత్త పెళ్లికూతురు దారుణ హత్య...?

Karimnagar : ఇంట్లో ఒంటరిగా ఉన్న కొత్త పెళ్లికూతురు హత్య...?

Karimnagar : పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..అప్పుడే ఓ యువతి హత్యకు గురైంది..ఎవరో కక్షగట్టి నవ వధువును విచక్షణరహితంగా కత్తులతో పొడిచి చంపారు. దీంతో రక్తపుమడుగులో యువతి కనిపించింది. హత్యకు ముందు యువతి ఎవరితోనో ఘర్షణకు దిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 • Share this:
  కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ నవవధువును గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి చంపేశారు.హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లికి చెందిన మ్యాదరి అనిల్‌తో హుజూరాబాద్‌కు చెందిన ప్రణాళిక అనే యువతితో గత మే 21న పెళ్లి జరిగింది. అంటే పెళ్లి జరిగి సరిగ్గా మూడు నెలలు అవుతోంది. అయితే పెళ్లి జరిగినప్పటి నుండి కుటుంబపరంగా ఎలాంటీ వివాదాలు లేకుండా సాఫిగా కొనసాగుతోంది.

  ఈ క్రమంలోనే అనిల్ హుస్నాబాద్‌లో ఓ బ్యాటరీ షాపులో పని చేస్తుండగా, ప్రణాళిక అత్తమామాలు ఇద్దరు వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయమే వెళ్లారు. దీంతో ప్రణాళిక ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది. కాగా శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనుల నుండి తిరిగి వచ్చిన అత్తమామాలు షాక్‌కు గురయ్యారు. తన బెడ్‌రూంలో ప్రణాళిక శవంగా పడిఉండడంతో విషయం చుట్టుపక్కల వారితోపాటు పోలీసులకు సమాచారం అందించారు.

  అయితే ప్రణాళికను హత్య చేసే కంటే ముందు ఘర్షణ జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర వ్యక్తులతో వాగ్వాదం జరిగి ఉంటుందని ..దీంతో పథకం ప్రకారం దుండగులు తమ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ పోలీసు కమీషనర్ కమలహాసన్ రెడ్డి పరీశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీపీ కమలహాసన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా సంఘటన వెనక యువతికి సంబంధించిన వ్యక్తగత కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
  Published by:yveerash yveerash
  First published: