Marriage twist : పెళ్లికి ముందు బావా.. తర్వాత వరసకు సోదరుడు అయ్యాడు.. వారం రోజుల్లోనే పెళ్లింట విషాదం

పెళ్లికి ముందు బావా.. తర్వాత వరసకు సోదరుడు అయ్యాడు.

Marriage twist : పెళ్లికి ముందు బావనవుతానని అన్నాడు.. తనను ప్రేమించానంటూ అమ్మాయి వెంటపడ్డాడు. తీరా చూస్తే వరసకు అన్న కావడంతో యువతి మనస్థపానికి గురైంది.. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆత్మహత్య చేసుకుంది. అది చూసి భరించ లేని భర్త సైతం ఆత్మహత్య చేసుకున్నాడు.

 • Share this:
  గతంలో పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు తరాలు చూసి సంబంధాన్ని నిర్ణయించేవారు. అంటే రక్తసంబధంతో పాటు వారికి ఉండే వ్యాధులు, తమకు ఉండే రక్త సంబంధాలపై ఆరా తీసే వారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. మ్యాట్రీమోనియల్ పెళ్లిల్లు ఆరు నెలల తర్వాత విడాకులు ఇలా కాలంలో మార్పులు అనేకం చేటు చేసుకున్నాయి.

  ఇక వీటికి తోడు ప్రేమ పెళ్లిళ్లకు( love marraige) ఇవేమి పట్టింపులు లేవు. తమకు ఏ వరుస అయినా పర్వాలేదు. ప్రేమిస్తే చాలు ..ఒకరిపై ఒకరు మనసు పడితే అంతే.. పెళ్లి కావాల్సిందే.. లేదంటే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఇలాంటీ ప్రేమ పెళ్లి విషాదాన్ని(tragedy) నింపింది. అది కూడా రక్త సంబంధాల్లో తేడా రావడంతో అబ్బాయి చేసిన మోసానికి ఘర్షణకు దిగింది. పెళ్లికి ముందే ఏకంగా తన ఇంటిపేరునే మార్చి చెప్పినందుకు యువతి మనస్థపానికి గురైంది. దీంతో ఆత్మహత్య(suicide) చేసుకుని కుటుంబానికి షాక్ ఇచ్చింది.

  ఇది చదవండి : రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత.. టీఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీల మధ్య కర్రలతో దాడులు.!


  వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం (kothagudem)జిల్లా ఇల్లందు మండలంలోని నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన డిగ్రీ చదువుతున్న విద్యార్థిని బోడ శ్వేతను(sweta) అదే మండలంలోని కట్టుగూడెం గ్రామానికి చెందిన గూగులోతు వెంకటేష్ (venkatesh)అలియాస్ బంటి ప్రేమించాడు. వెంకటేష్ ప్రేమకు ఓకే చెప్పిన శ్వేత పెళ్లి చేసుకుంది. అయితే ట్విస్ట్(twist) ఏంటంటే పెళ్లికి ముందే ప్రేమించిన వెంకటేశ్ .. అమ్మాయికి అబధ్దం చెప్పాడు. తన ఇంటిపేరును మార్చి పెళ్ళికి ఒప్పించాడు.

  అయితే పెళ్లి పది రోజులు గడుస్తున్న నేపథ్యంలోనే తర్వాత ఇరు కుటుంబాలు కలిసినప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయి. పెళ్లి చేసుకున్న వెంకటేశ్ ఇంటిపేరు తప్పుగా చెప్పినట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో వెంకటేశ్ శ్వేతకు వరసకు సోదరుడు అవుతాడని నిర్ణయించారు. అయితే ఈ విషయం వెంకటేశ్‌కు ముందే తెలిసినా అబద్దం చెప్పినట్టు శ్వేత గమనించింది. వరుసకు అన్నను పెళ్లి చేసుకున్నాననే ఫీలింగ్‌లోకి వెళ్లిపోయింది. సోదరుడైనా... వరసకు బావ అవుతాడని నమ్మించడం ఆమె భరించలేక పోయింది.

  ఇది చదవండి : అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క.. దళిత గిరిజన దండోర సభలో సంఘటన


  పది రోజుల తర్వాత అసలు విషయం బయటపడడంతో ఆమె ఆందోళనకు గురైంది. వెంకటేశ్ తనను మోసం చేశాడని భావించింది. దీంతో మంగళవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు (suicide)పాల్పడింది. దీంతో ఆసుపత్రికి (hospital)తరలించిన ఫలితం లేకపోవడంతో ప్రాణాలు విడించింది.

  దీంతో విషయం తెలిసిన వెంకటేశ్ కూడా అందోళనకు గురయ్యాడు. శ్వేతను మోసం చేయడంతో భయానికి గురయ్యాడు. తాను కూడా స్వగ్రామంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వెంటనే గమనించిన ఆయన తల్లిదండ్రులు బావి నుండి తీసి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు శ్వేత మృతికి కారణం వెంకటేశ్ అంటూ ఆమె శవాన్ని ఇంటి ముందు వేసి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. విషయం పోలీసులకు(police) చేరడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:yveerash yveerash
  First published: