హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఘోరం.. ఆ కన్నతల్లి గుండె రాయిలా మారిపోయిందా..? రోడ్డు పక్కన బోర్డుకు ఉయ్యాల కట్టి మరీ..

ఘోరం.. ఆ కన్నతల్లి గుండె రాయిలా మారిపోయిందా..? రోడ్డు పక్కన బోర్డుకు ఉయ్యాల కట్టి మరీ..

ఈ బోర్డు ఊయల కట్టి.. పసిపాపను అందులో పడుకోబెట్టి వెళ్లిపోయారు

ఈ బోర్డు ఊయల కట్టి.. పసిపాపను అందులో పడుకోబెట్టి వెళ్లిపోయారు

మాతృత్వం ఓ వరం. అందుకోసం ఎన్నో వ్రతాలు, పూజలు చేస్తుంటారు. అలాంటిది కలిసి వచ్చిన ఆ వరాన్ని కాలరాసింది ఓ కసాయి తల్లి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఓ రెండు నెలల పసికందును..

మాతృత్వం ఓ వరం. అందుకోసం ఎన్నో వ్రతాలు, పూజలు చేస్తుంటారు. అలాంటిది కలిసి వచ్చిన ఆ వరాన్ని కాలరాసింది ఓ కసాయి తల్లి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఓ రెండు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లారు. పొచ్చెర గ్రామ శివారులోని ఓ ప్రయివేట్ జిన్నింగ్ ఫ్యాక్టరీ బోర్డుకు చీరతో ఓ ఉయ్యాలను కట్టి అందులో ఆ పసికందును పడుకోబెట్టి వెళ్లారు. అటుగా వెళ్లిన స్థానికులు పసికందు ఏడుపులు వినిపించడంతో ఆశ్చర్యపోయారు. ప్యాక్టరీ బోర్డుకు ఉన్న చీర ఉయ్యాలలో పసికందును గమనించిన స్థానికులు తాంసి పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు, బాలల పరిరక్షణ అధికారి, చైల్డ్ లైన్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు.

పసికందును జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించి ప్రథమ చికిత్సలు అందజేశారు. అనంతరం అధికారులు పసికందును శిశు గృహకు తరలించారు. పోలీసులు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కావాలనే ఎవరో వదిలించుకున్నారని, లేక అక్రమ సంతనమేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఆసుపత్రుల్లోనూ ఊళ్లల్లోనూ ఎవరికి కాన్పులు జరిగాయన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ఊళ్లల్లో ఈ విషయం గురించి విస్తృతంగా ప్రచారం చేయించాలనీ, తద్వారా అనుమానితులపై ఫిర్యాదులు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.


ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

కాగా, హైదరాబాద్ లో కూడా అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి జరగడం గమనార్హం. హైదరాబాద్ లోని బాలాపూర్ డీఆర్ డీఎల్ శివాజీ చౌక్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంటుంది. బుధవారం స్థానికులకు రోడ్డు పక్కన ఓ అట్టపెట్టె కనిపించింది. దాని చుట్టూ కుక్కలు చేరి అరుస్తుండటంతో స్థానికులకు అనుమానం కలిగింది. కొందరు వ్యక్తులు ధైర్యం చేసి ఆ అట్టపెట్టెను ఓపెన్ చేశారు. అందులో మగబిడ్డ మృతదేహం ఉంది. ఓ వస్త్రంలో బిడ్డను చుట్టి అట్టపెట్టెలో ప్యాక్ చేసి మరీ రోడ్డు పక్కన పడేశారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డలా ఉందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నా డబ్బు.. నా ఇష్టమంటూ.. 60 ఏళ్ల వృద్ధ డాక్టర్ నిర్వాకం.. అమ్మాయిలతో చాటింగ్ కోసం రూ.70 లక్షలు..!

First published:

Tags: Adilabad, Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Telangana, Wife kill husband

ఉత్తమ కథలు