హోమ్ /వార్తలు /తెలంగాణ /

న్యూ ఇయర్ రష్: రికార్డు స్థాయిలో హైదరాబాదీల మెట్రో ప్రయాణం

న్యూ ఇయర్ రష్: రికార్డు స్థాయిలో హైదరాబాదీల మెట్రో ప్రయాణం

ఇక గతంలో మాదిరిగా ప్రతీ స్టేషన్‌లో మెట్రో రైలు ఆగదని... రద్దీ అంతగా ఉండని స్టేషన్లలో రైళ్లు ఆపకపోవచ్చని సమాచారం.

ఇక గతంలో మాదిరిగా ప్రతీ స్టేషన్‌లో మెట్రో రైలు ఆగదని... రద్దీ అంతగా ఉండని స్టేషన్లలో రైళ్లు ఆపకపోవచ్చని సమాచారం.

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మెట్రోలో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 2 లక్షల మార్కును దాటింది.

  కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా  మెట్రోకు తాకిడి ఎక్కువైంది. అంతేకాకుండా మెట్రో  రైలు సేవల సమయాన్ని కూడా పొడిగించారు. దీంతో ఈ ఒక్క రోజులోనే 2.25 లక్షల మంది ప్రయాణించారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లు నడిపారు. దీంతో మెట్రోలో ప్రయాణించిన వారిసంఖ్య మొదటిసారి 2 లక్షల మార్క్‌ను దాటిందని హెచ్‌ఎమ్మార్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పెర్కోన్నారు.

  ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ రూట్‌లో 1.65 లక్షల మంది ప్రయాణించారు. నాగోల్‌–అమీర్‌పేట్‌ రూట్‌లో సుమారు 60 వేల మంది మెట్రోలో ప్రయా ణం చేసినట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అమీర్‌పేట్, మియాపూర్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ, ఉప్పల్‌ స్టేషన్స్ ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఈ రద్దీ సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12.30 గం. వరకు కొనసాగిందన్నారు ఎన్వీఎస్‌ రెడ్డి.

  Photos: బ్యూటీఫుల్ అంజలి లేటెస్ట్ ఫోటోస్

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Hyderabad Metro, Metro, New Year 2019

  ఉత్తమ కథలు