Hyderabad: రేపు రాత్రి హైదరాబాద్‌ నగరంలో ఆంక్షలు.. ఈ విషయాలు గుర్తుంచుకోండి

రేపు రాత్రి హైదరాబాద్‌ నగరంలో ఆంక్షలు

హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సరపు వేడుకల‌పై నిషేధం విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్‌ నగరంలో పోలీసులు శాఖ పలు ఆంక్షలు విధించింది.

  • Share this:
    హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సరపు వేడుకల‌పై నిషేధం విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్‌ నగరంలో పోలీసులు శాఖ పలు ఆంక్షలు విధించింది. రేపు రాత్రి పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది. సైబర్‌ టవర్స్‌, గచ్చిబౌలి, బయోడైవరిర్సటీ ఫ్లేఓవర్లు, జేఎన్‌టీయూ, మైండ్‌స్పేస్‌, దుర్గం చెరువు తీగల వంతెనలను మూసివేయనున్నట్లు హైదరాబాద్, సైబరాబాద్ డీసీపీలు చెప్పారు. బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డుపైకి కార్లను అనుమతించబోమని తెలిపారు. నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌, బీఆర్‌కే భవన్‌, తెలుగు తల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, నల్లగుట్ట రైల్వే వంతెన వద్ద వాహనాలను దారి మళ్లించనున్నట్లు చెప్పారు.

    పోలీసు శాఖ ఆదేశాలను ఉల్లంఘించి.. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం 5 గంటల వరకు ఈ అంక్షలు కొనసాగుతాయని తెలిపింది. ఇక, నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఇది వరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.

    Telangana: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

    ఇక, కొద్ది రోజుల క్రితం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతామన్నారు. ఈ నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
    Published by:Sumanth Kanukula
    First published: