హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: 17 ఏళ్లు నిండాయా? మీ కోసమే.. తెలంగాణలో ప్రత్యేక ఓట్ల నమోదు ప్రక్రియ షురూ 

Telangana: 17 ఏళ్లు నిండాయా? మీ కోసమే.. తెలంగాణలో ప్రత్యేక ఓట్ల నమోదు ప్రక్రియ షురూ 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: గతంలో కేవలం 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు నమోదు ప్రక్రియ చేపట్టేవారు. అయితే మారిన నిబంధనల మేరకు 17 సంవత్సరాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి వారికి 18 రాగానే ఆన్లైన్‌లో అప్ డేట్ చేస్తారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ(Telangana)లో కొత్త ఓట్ల నమోదు ప్రక్రియ (New Voters Registrations)  మొదలైంది.  నవంబర్ 26-27, డిసెంబర్ 3-4 తేదీల్లో ప్రత్యేక ఓట్ల నమోదు డ్రైవ్ నిర్వహించనున్నారు. 18 సంవత్సరాలు  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు తమను తాము నమోదు చేసుకోవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas Raj) వెల్లడించారు.17 సంవత్సరాలు పైబడిన వారు కూడా ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన మీడియాకు తెలిపారు. 17 ఏళ్ల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో నవంబర్‌ 26, 27, డిసెంబర్‌ 3, 4 తేదీల్లో ప్రత్యేక ఓట్ల ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌  తెలిపారు.

 హైదరాబాద్ లో చదువుకునే విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త.. రెండు కీలక నిర్ణయాలు.. వివరాలివే

ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమ్మరీ రివిజన్ గురించి ప్రధాన ఎన్నికల అధికారి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా, దరఖాస్తు ఫారమ్‌లను స్వీకరించడానికి బ్లాక్ స్థాయి అధికారులు పోలింగ్ స్టేషన్‌లలో అందుబాటులో ఉంటారని ఆయన గుర్తుచేశారు. ముందుగా 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు స్వయంగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చని, 17 ఏళ్లు పైబడిన వారు కూడా ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చని రాజ్ తెలిపారు. ఓటరు ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.

గతంలో కేవలం 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు నమోదు ప్రక్రియ చేపట్టేవారు. అయితే మారిన నిబంధనల మేరకు 17 సంవత్సరాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి వారికి 18 రాగానే ఆన్లైన్‌లో అప్ డేట్ చేస్తారు. దీని వల్ల ఓటు హక్కు సకాలంలో వినియోగించుకునేందుకు అవకాశం దక్కుతుంది. ఒక వేళ 18 సంవత్సరాల నిండిన వెంటనే ఎన్నికలు వస్తే గతంలో ఓటు ఉండేది కాదు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారం 17 ఏళ్లు దాటిన వారి వివరాలు కూడా సేకరించి పెట్టుకుంటున్నారు. అలా 18 దాటగానే వెంటనే వారికి  ఓటు హక్కు వస్తుంది.

సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోపెట్టుకునే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే కొత్త ఓట్ల నమోదు ప్రక్రియ చేపట్టింది. అన్నీ రాష్ట్రాల్లోనూ కాలేజీల్లో ఓట్ల నమోదు చేయడంతో పాటు, స్వయంగా ఆన్ లైన్ ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించారు. దీని వల్ల కొత్తగా దేశ వ్యాప్తంగా 3 కోట్ల కొత్త ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త ఓట్ల నమోదు ద్వారా తెలంగాణలో 12 లక్షల ఓట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

First published:

Tags: Hyderabad, Telangana, Voters Registration

ఉత్తమ కథలు