NEW TYPE ATM SCAM IN HYDERABAD WIFE AND HUSBAND ARRESTED VRY
ATM new Scam : సరికొత్త రీతిలో ఏటీఎం స్కాం.. ఖాతా ఉన్న వారే దోపిడి చేశారు.. !
ప్రతీకాత్మక చిత్రం
ATM Scam : ఏటిఎంలలో దోపిడి పలు రకాలుగా ఉంటుంది. తాజాగా మరోసరి కొత్త దోపిడికి తెర తీశారు. ఇద్దరు జంట. అది కూడా హైదరాబాద్‌కు చెందిన దంపతులు కావడం విశేషం. ఇలా బ్యాంకు అధికారులను బురిడి కొట్టించి వేల రూపాయలను బురిడి కొట్టిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ (Hyderabad )నగరంలో సరికొత్త దోపిడీ వెలుగు చూసింది. బండ్లగూడ ప్రాంతానికి చెందిన దంపతులు ఏటీఎం లే ( ATM ) లక్ష్యంగా ఈ దోపిడీకి తెర లేపారు. చివరికి బ్యాంక్ అధికారులు పసిగట్టడంతో.. వారి దోపిడీకి అడ్డుకట్టడ పడటమే కాకుండా వారు దోపిడి చేసిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సాధరణంగా ఏటిఎంలలో డబ్బు దోపిడికి అనేక మార్గాలు ఉంటాయి. ఏటిఎంకు వచ్చి ఇతరులను మాయ చేసి వారి పాస్‌వర్డు తో డబ్బులు డ్రా చేసుకోవడం లాంటి సంఘటనలు జరిగాయి.అయితే తప్పుడు సమాచారంతో బ్యాంక్ అధికారులను బురిడి కొట్టించి డబ్బులు కాజేశారు హైదరాబాద్‌కు చెందిన జంట . నగరంలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజాహిద్(27), సాజిదా(25) దంపతులు, కొంతకాలంగా ఏటీఎంలే లక్ష్యంగా సరికొత్త చోరీలకు పాల్పడుతున్నారు. ఎవరూ లేని సమయంలో వీరు ఎటీఎం సెంటర్లోకి వెళతారు .
ఆ తరువాత ఏటీఎం మొత్తం పని చేయకుండా స్విచ్ఛాఫ్ చేస్తారు. తిరిగి ఏటీఎం మిషన్‌ను పది నిమిషాల తరువాత స్విచాన్ చేస్తారు. ఆ తర్వాత సంబంధిత బ్యాంకు అధికారులకు ఫోన్ (phone ) చేసి ఫలాన ఏటింలో తమ నగదు (money) రాలేదని చెబుతారు. తమ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి డబ్బులు కట్ అయ్యాయని కాని తమకు డబ్బులు రాలేదని ఫిర్యాదు చేస్తారు. అది నమ్మిన.. బ్యాంకు అధికారులు వారి ఖాతాలకు నగదును బదిలీ చేస్తుంటారు. బ్యాంకు ఎలా క్రాస్ చెక్ చేసుకోకుండా డబ్బును బదిలీ చేస్తారనే అనుమానాలు అవసరం లేదు.. ఎందుకంటే ఇక్కడ ఓ సాంకేతిక లొసుగును (Tecnical issue ) నిందితులు ఉపయోగించుకున్నారు. ఏటీఎం మిషన్‌ను స్విచ్ఛాఫ్ చేసిన సమయంలో అందులో జరిగిన ట్రాన్సాక్షన్ డేటా పూర్తిగా కనిపించకుండా పోతుంది. ఆ సాంకేతిక లొసుగును తెలుసుకుని.. నిందితులు రెచ్చిపోతున్నారు..
అయితే ఈ క్రమంలోనే కొంపల్లి ( kompally )ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో నిజమే అనుకుని వారికి రూ. 20 వేల నగదును బదిలీ చేశారు. అయితే, ఇలా ఎందుకు జరిగిందని ఆయన ఏటిఎం మిషన్ సీసీ కెమెరాను ( cc camera ) కొద్ది రోజుల తర్వాత పరిశీలించారు. దాంట్లో ఫిర్యాదు చేసి డబ్బును తీసుకున్న దంపతులే.. ఏటీఎం మెషీన్‌ను స్విచ్ఛాఫ్ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఫుటేజీని గమనించిన బ్యాంకు మేనేజర్ దాని ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మేనేజర్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.