• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • NEW TWIST INSTANT LOAN APPS FRAUD A DAILY LABOUR ACCOUNT HAVING ONE CRORE RUPEES HERE IS FULL DETAILS HSN

Instant loan Apps: షాకింగ్.. కూలి పనికి వెళ్లే వ్యక్తి బ్యాంకు ఖాతాలో ఏకంగా కోటి రూపాయలు.. ఆరా తీస్తే అసలు నిజం తెలిసి..

Instant loan Apps: షాకింగ్.. కూలి పనికి వెళ్లే వ్యక్తి బ్యాంకు ఖాతాలో ఏకంగా కోటి రూపాయలు.. ఆరా తీస్తే అసలు నిజం తెలిసి..

ప్రతీకాత్మక చిత్రం

ఓ రోజు కూలీ బ్యాంకు ఖాతాలో ఒకటి రెండు లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయల డబ్బు ఉంది. ఈ విషయం తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతడిని పట్టుకుని, బ్యాంకు ఖాతాలో డబ్బు గురించి ఆరా తీస్తే అసలు నిజం తెలిసి కంగుతిన్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

  • Share this:
    రోజు వారీ కూలికి వెళ్లే ఓ వ్యక్తి సంపాదన మహా అయితే ఎంత ఉండొచ్చు. నెల మొత్తం మీద 25 రోజులు పనికి వెళ్తే రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున నెలకు 10 నుంచి 12వేల రూపాయల వరకు ఉండొచ్చు. రెంటు, కరెంటు బిల్లు, టీవీ బిల్లు, అప్పులు, వైద్యం, పిల్లల చదువుల పీజులు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అవసరాలు తీరాలంటే మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఢిల్లీలోని ఓ రోజు కూలీ బ్యాంకు ఖాతాలో ఒకటి రెండు లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయల డబ్బు ఉంది. ఈ విషయం తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతడిని పట్టుకుని, బ్యాంకు ఖాతాలో డబ్బు గురించి ఆరా తీస్తే అసలు నిజం తెలిసి కంగుతిన్నారు. తన బ్యాంకు ఖాతాలో కోటి రూపాలయ డబ్బు ఉందన్న నిజం పోలీసులు చెప్పేవరకు అతడికి తెలియకపోవడం గమనార్హం. ఆన్ లైన్ యాప్స్ కేటుగాళ్ల వలలో అతడిని ఓ పావుగా ఉపయోగించుకున్న వైనం గురించి తెలంగాణ పోలీసులు ఓ దారుణ నిజాన్ని వెల్లడించారు.

    ఆన్ లైన్ యాప్స్ నిర్వాహకులపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మంది నిర్వాహకులను ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు కూడా. విచారణలో భాగంగా వీళ్లు దౌర్జన్యంగా సంపాదిస్తున్న డబ్బు ఎక్కడికెళ్తోంది.? ఏఏ బ్యాంకు ఖాతాల్లో దాస్తున్నారు.? అన్న విషయాలను ఆరా తీస్తున్నారు. బ్యాంకు ఖాతాలు ఎవరివో తెలిస్తే అసలు సూత్రధారులు బయటపడతారన్నది పోలీసులు వ్యూహం. దీనిలో భాగంగా కోటి రూపాయలకు పైగానే డబ్బు ఉన్న ఓ బ్యాంకు ఖాతా ఢిల్లీలో ఉందని తెలిసింది. దీంతో ఢిల్లీకి వెళ్లిన పోలీసులు ఆ బ్యాంకు ఖాతా ఎవరిదో ఆరా తీశారు. బ్యాంకుకు వెళ్లి అతడి వివరాలు సేకరించారు.

    అతడిని వెతుక్కుంటూ బ్యాంకులో ఇచ్చిన అడ్రస్ కు వెళ్లారు. తీరా ఆ అడ్రస్ లో పోలీసులకు ఓ పూరి గుడిసె, ఓ సాదారణ కూలీ ప్రత్యక్షమయ్యాడు. ఆ బ్యాంకు ఖాతా తనదేనని పోలీసులకు ఆ వ్యక్తి చెప్పాడు. ’నీ బ్యాంకు అకౌంట్లో డబ్బు ఎంత ఉందో తెలుసా.?‘ అని పోలీసులు అడిగితే ’అవేమీ నాకు తెలియదు. కొందరు వ్యక్తులు వచ్చి నా పేరుతో బ్యాంకు ఖాతా తీసుకుంటామన్నారు. నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నారు. సరేనన్నాను. నా కుటుంబ అవసరాలకు ఆ డబ్బు ఉపయోగపడుతుందని ఒప్పుకున్నా. అందులో కోటి రూపాయల డబ్బు ఉందని మీరుచెప్పేదాకా నాకు తెలియదు. నా వెనక ఏదో కుట్ర జరుగుతోంది. నన్ను నా కుటుంబాన్ని ఏదైనా చేస్తారేమో.‘ అని ఆ కూలీ భయపడుతూ విషయమంతా చెప్పేశాడు. అతడికి ఏటీఎంను ఉపయోగించడం కూడా ఎలాగో తెలియదని విచారణలో తేలింది. దీంతో ఆన్ లైన్ యాప్స్ నిర్వాహకులు అమయాకులకు డబ్బు ఆశ చూపి, వారి ప్రూఫ్స్ ను ఉపయోగించుకుని బ్యాంకు ఖాతాలను తెరవడం, వాటిని తమ అక్రమాలకు వాడుకోవడం వంటివి చేస్తున్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు